Ugadi 2025 rashiphal: ధనుస్సురాశి వారికి ఈ ఏడాది తిరుగేలేదు

విశ్వావసు నామ సంవత్సర ఉగాది దగ్గరకు వచ్చింది. అయితే ఉగాది నుండి తమ జాతకాలు ఏ విధంగా ఉన్నాయి? తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ఇక ఇందులో భాగంగానే ద్వాదశ రాశుల ఫలితాలను వన్ ఇండియా అందిస్తోంది .ఈ క్రమంలో ప్రస్తుతం మనం ధనుస్సు రాశి ఫలితాలను తెలుసుకుందాం.

ధనుస్సు రాశి వారి జాతకమిలా
ధనుస్సు రాశి వారికి 2025 సంవత్సరంలో ఉగాది తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీరికి అర్ధాష్టమ శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1 అవమానం 5గా ఉంది. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వీరికి ఆశించిన ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది.

Ugadi 2025 rashiphal career growth and wealth to sagittarus from ugadi

ఉద్యోగాలు చేసేవారికి ఫలితాలిలా
మే 18వ తేదీ నుండి రాహువు తృతీయ స్థానంలో ఉంటాడు. మే 25 నుంచి గురువు సప్తమ స్థానంలో ఉంటాడు. ఫలితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి . ఉద్యోగంలో పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి. విదేశీ సంస్థలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

ఆదాయ వృద్ధి అవకాశాలు
ఇక రాశి అధిపతి అయిన గురువు స్థానంలో శని సంచారం చేయడం కారణంగా జులై మాసం తర్వాత ఆదాయ వృద్ధి ప్రయత్నాలు మరింత విజయవంతం అవుతాయి. జీవితం సానుకూల మలుపులతో కొత్త పరిణామాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి బలోపేతం అవుతాయి. ఈ సమయంలో పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది.

ఈ ఏడాది వీరికి కలిసొస్తుంది
శుభకార్యాలు జరుగుతాయి. ఇక విద్యార్థులకు కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారికి పెట్టుబడులు పెట్టే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక మొత్తంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా, కెరీర్ పరంగా అనుకున్నవన్నీ సాధించి దూసుకుపోతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+