ugadi panchangam 2023: మేషరాశి నుండి కన్యారాశి వరకు ఆదాయ వ్యయాలిలా.. శుభఫలితాలకు పరిహారాలివే!!
ఉగాది నుండి మేషరాశి నుండి కన్యారాశి వరకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇలా ఉంటాయని, శుభఫలితాలకు ఈ పరిహారాలు చేస్తే మంచిదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
తెలుగు సంవత్సరాది అయిన ఉగాదికి గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మార్పు చెందుతాయి. దీంతో రాశి ఫలాల జాతకుల జీవితాలలోనూ మార్పులు సంభవిస్తాయి. ఉగాది వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు తమ రాసి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. పంచాంగ శ్రవణ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సంవత్సరం తమకు కలిసొస్తుందా లేదా? లాభదాయకంగా ఉంటుందా లేదా? ఒకవేళ నష్టం ఉంటే దానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే అనేక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు.

ఉగాదికి ఆయా రాశుల వారి ఆదాయ వ్యయాలు .. పరిహారాలు
ఇక శోభకృత్ నామ ఉగాది సంవత్సరం రానే వచ్చింది. అందరూ ఉత్సాహంగా తమ రాశి ఫలాలను తెలుసుకుంటున్నారు. అయితే ఈసారి కొన్ని రాశులకు బాగా కలిసి వస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి మరీ అశుభ సంకేతాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక అలాంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి? ఏ రాశుల వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరు రాశుల వారికి చెయ్యాల్సిన పరిహారాలు ఇక్కడ సూచించబడ్డాయి.

మేషరాశి
మేష రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3 అవమానం 1గా ఉంది. ఇక మేష రాశి జాతకులకు ఈసారి ఫలితం సాధారణంగా ఉంటుందని చెప్పబడింది. ఈసారి మేష రాశి జాతకులు తమ జాతకంలోని దోషాలు తొలగిపోవడానికి, కాస్త మెరుగైన ఫలితాలు పొందడానికి శనగలను పక్షులకు వేయడం, గురుపూజ చేయడం, శివాలయాన్ని దర్శించుకోవడం మంచిదని సూచించబడింది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఈసారి ఆదాయం 14 వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజం 6 అవమానం 1గా ఉంటుంది. వృషభ రాశి జాతకుల ఫలితం కూడా ఈసారి సాధారణంగానే ఉన్నట్టుగా జ్యోతి శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. వృషభ రాశి జాతకులు మెరుగైన ఫలితాల కోసం రావి చెట్టుకు ప్రదక్షణ చేయడం, పెరుగు, నెయ్యి, కర్పూరం దేవాలయంలో ఇవ్వడం, దుర్గాదేవి పూజ చేయడం మంచిదని సూచించబడింది.

మిథున రాశి
ఇక మిధున రాశి జాతకులకు ఈసారి ఆదాయం 2, వ్యయం11 గా ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4 గా ఉంటుంది. మిధున రాశి జాతకులకు ఈసారి శుభంగా ఉంటుంది. మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఇంకా మెరుగైన ఫలితాల కోసం మిధున రాశి జాతకులు శివాలయాన్ని దర్శించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం చేయాలని సూచించబడింది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈసారి ఆదాయం 11 గా, వ్యయం 8 గా ఉంది. రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది. కర్కాటక రాశి జాతకులకు ఈసారి ఫలితాలు సాధారణంగా ఉంటాయి. కర్కాటక రాశి జాతకులు మెరుగైన ఫలితాల కోసం శని పూజ, జమ్మి చెట్టు ప్రదక్షిణ, తైలాభిషేకం, శివ పూజ వంటి పరిహారాలు చేయాలని సూచించబడింది.

సింహరాశి
సింహరాశి వారి జాతకులకు ఈసారి ఆదాయం 14 గా, వ్యయం 2గా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది. సింహరాశి జాతకులకు ఈసారి ఫలితాలు సాధారణంగా ఉంటాయని చెబుతున్నారు. మంచి మెరుగైన ఫలితాల కోసం సింహరాశి జాతకులు తిలాపాత్ర దానం చేయాలని, నల్ల గోవులను ఆరాధించాలని, రుద్రాభిషేకం చేయాలని పరిహారాలు సూచిస్తున్నారు.

కన్యా రాశి
కన్య రాశి జాతకులకు ఈసారి ఆదాయం 2, వ్యయం 11 గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 7 గా ఉంది. కన్యారాశి జాతకులకు ఈసారి అశుభ ఫలితాలు వస్తాయని చెప్పబడింది. కన్యారాశి జాతకులు మరుగైన ఫలితాల కోసం రావి చెట్టు ప్రదక్షణ చేయడం, పసుపు తిలక ధారణ, శ్రీశైల క్షేత్ర దర్శనం చేయడం పరిహారాలుగా సూచించబడింది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications