ugadi panchangam 2023: తులారాశి నుండి మీనరాశి వరకు ఆదాయ వ్యయాలిలా.. శుభఫలితాలకు పరిహారాలివే!!
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ నుండి గ్రహాల సంచారం మార్పుతో రాశుల ఫలితాలలోను మార్పులు చోటు చేసుకుంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక 2023 శోభకృత్ నామ ఉగాది సంవత్సరం రానే వచ్చింది. దీంతో తమ జాతకం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు.
రాశి ఫలాలలో అశుభ ఫలితాలకు పరిహారాలు
కొందరు తమ జాతకంలో అశుభ ఫలితాలు ఉన్నాయి అని తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు. అయితే అశుభ ఫలితాలు ఉన్నంత మాత్రాన ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వాటికి మంచి పరిహారాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ప్రస్తుతం మనం తులారాశి నుండి మీన రాశి వరకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి. అలాగే వారు చేయవలసిన పరిహారాలు ఏమిటి వంటి వివరాలను తెలుసుకుందాం.

తులారాశి
తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 గా, వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరింత మెరుగైన ఫలితాల కోసం తులారాశి జాతకులు సంకటహర గణపతి ఆరాధన చేయడం, గణపతికి ఉండ్రాళ్ళను నివేదించడం మంచిదని సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అశుభ ఫలితాలు వస్తాయని చెప్పబడింది. వృశ్చిక రాశి జాతకులు మెరుగైన ఫలితాల కోసం, పని వాళ్లకు సహాయం చేయాలని, తీపి గుమ్మడికాయను దానం చేయాలని, శనికి తైలాభిషేకం చేసి, శివాలయ దర్శనం చేయాలని సూచించబడింది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను ఉంటుంది. రాజపూజ్యం 6 అయితే, అవమానం మూడుగా ఉంటుంది. ధనస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది. వీరు మరుగైన ఫలితాల కోసం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం మంచిదని సూచించబడింది.

మకర రాశి
మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉంది. రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. అయితే మకర రాశి జాతకులు మెరుగైన ఫలితాల కోసం నవగ్రహ జపం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, దేవాలయాలను దర్శించడం వంటి పరిహారాలను సూచించారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

కుంభరాశి
కుంభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంటుంది. కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం అశుభ ఫలితాలు వస్తాయని సూచించబడింది. శనికి తైలాభిషేకం, శివుడికి రుద్రాభిషేకం చేయడం మంచిదని సలహా ఇవ్వబడింది. శనివారం నియమం పాటించడం తోపాటు, శనివారం నాడు ఎక్కువగా నడక సాగించవలసిన అవసరం ఉందని చెప్పబడింది.

మీనరాశి
మీన రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను ఉంది. రాజపూజ్యం 1, అవమానం రెండుగా ఉంది. మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం శుభంగా కనిపిస్తుంది. మీనరాశి జాతకులు ఇంకా మెరుగైన ఫలితాల కోసం శని గ్రహ జపం చేయాలని, శనికి తైలాభిషేకం చేయాలని, ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications