వరలక్ష్మీ వ్రతం చేస్తున్నవాళ్లు ఈ తప్పులు అసలే చెయ్యొద్దు.. ఫలితముండదు!
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకోవటం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. ఈ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని భర్త, కుటుంబ శ్రేయస్సును, సంపదను కాంక్షిస్తూ పూజలు చేస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తున్నారా? తప్పక తెలుసుకోండి
వరలక్ష్మీ వ్రతం చెయ్యాలనుకునే మహిళలు వ్రతం నాడు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగన స్నానమాచరించి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టాలి. చక్కగా ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి, వరలక్ష్మీ వ్రతానికి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మండపంలో బియ్యం పిండితో ముగ్గువేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటోనుగానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్టించుకుని పూజలు చెయ్యాలి.

వరలక్ష్మీ వ్రతం నియమాలను పాటిస్తూ చెయ్యాలి
వరలక్ష్మీ వ్రతం చేసే వారు వ్రత నియమాలను పాటించాలి. పూజా సామాగ్రి, పసుపు గణపతిని, అక్షింతలను, తోరాలను ముందే సిద్ధం చేసుకొని పూజకు ఉపక్రమించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి, అమ్మవారికి ఇష్టమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలీ. పూజ ముగిశాక ముత్తయిదువులకు పసుపు, కుంకుమలను ఇచ్చి, పండు తాంబూలంతో ఆశీర్వాదం తీసుకుని పూజను పూర్తి చెయ్యాలి.
వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారు చేయకూడని తప్పులు ఇవే
ఇక వరలక్ష్మీ వ్రతం చెయ్యాలనుకునే వారు నియమ , నిష్టలతో పూజలు చెయ్యటంతో పాటు అస్సలు చెయ్యకూడని కొన్ని పనులను తెలుసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఇళ్లలో చేయకూడని తప్పులు చేస్తే లక్ష్మీ దేవికి ఆగ్రహం వస్తుంది. కనుక ఆ తప్పులు ఏమిటో గుర్తుంచుకోండి. వరలక్ష్మీ వ్రతం నాడు కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు.
ఆదిపూజలు ఆయనకే.. తర్వాతే లక్ష్మీ పూజ
ఎప్పుడూ వరలక్ష్మీ వ్రత కలశాన్ని వెండి ప్లేట్ లో కానీ, రాగి ప్లేట్లలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజకైనా గణపతే మొదలు, అలాగే ఇక వరలక్ష్మీ వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతనే, లక్ష్మీదేవి పూజ చెయ్యాలి. గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు. ఇక వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్న ఇంట్లో ఎవరూ వ్రతం రోజు కోప తాపాలకు పోకూడదు.
వరలక్ష్మీ వ్రతం నాడు ఇలా అసలే చెయ్యొద్దు
ప్రతి ఒక్కరూ వరలక్ష్మీ అమ్మవారి పూజలో భాగస్వాములు కావాలి. అందరూ అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి. శక్తి కొలది, భక్తి తోటి అమ్మవారికి పూజ చేసి, నివేదన చేయాలని, మనసులో భక్తి లేకుండా ఫార్మాలిటీగా పూజలు చేయకూడదని చెబుతున్నారు. ఇది కేవలం ఆడవాళ్ళ పూజనే మాకేం సంబంధం లేదు అన్నట్టు ఏ ఒక్కరు ఉండకూడదు. ప్రతి సంవత్సరం చేస్తున్నాను కాబట్టి తప్పదు అన్న భావనతోనూ పూజలు చెయ్యకూడదు.












Click it and Unblock the Notifications