ఈ 3 ఇంట్లో ఉంటే వాస్తు దోషం పోతుంది... డబ్బుకు లోటుండదు?
హిందూ ధర్మంలో వాస్తు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. పవిత్ర వస్తువులను ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు.. వీటివల్ల వాస్తు దోషం తొలగిపోతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడంవల్ల శాంతి, సౌఖ్యంతోపాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెబుతున్నారు. వాటిల్లో ప్రధానంగా ఉండాల్సిన వస్తువులు మూడు. వాటిగురించి తెలుసుకుందాం.
ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన వస్తువు గంట. ప్రతిరోజు ఇంట్లో గంట మోగాలి. ఈశాన్యంలో దేవుడి మందిరం దగ్గర గంట మోగించాలి. ఇలా చేయడంవల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. అంతేకాదు.. గంటను మోగించడంవల్ల క్రిములు కూడా దూరమవుతాయి. ఇంట్లో ఉండాల్సిన రెండో వస్తువు శంఖం. శంఖం ఉన్న ఇళ్లల్లో వాస్తు దోషం తలెత్తదు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. శంఖం విష్ణువుకాగా.. లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనది. శంఖం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.

గంట, శంఖంతోపాటు ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మరో వస్తువు వేణువు. వెదురు వేణువు ఇంట్లో ఉండటంవల్ల ఎల్లప్పుడూ ఆనందంతోపాటు శ్రేయస్సు ఉంటుందనే నమ్మకం ఉంది. అంతేకాదు.. ఇది ఇంట్లో ఉండటంవల్ల వ్యాపారంతోపాటు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో ఒక్కసారైనా గంట మోగడంతోపాటు శంఖం ఊదడం, వేణుగానం నుంచి వచ్చే శబ్ధం వినిపించడంవల్ల ఆ ఇంటికి సంబంధించి ఏమైనా వాస్తు దోషాలున్నా తొలిగిపోతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషం పెరుగుతాయి.












Click it and Unblock the Notifications