వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది
వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న తర్వాత కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలన్నా, ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలన్నా ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలి. వాస్తుపరంగా కొన్ని కొన్ని సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ రావాల్సి ఉంటుంది. అలాగే అలంకారాలు కూడా ఉంటాయి. అందులో ప్రధానమైనవి చెట్లు. ఇంట్లో మందారం, నిమ్మ, అశోక, మనీప్లాంట్, తులసి, గులాబీ లాంటి మొక్కలు పెంచడం వాస్తు ప్రకారం చాలా మంచిది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే ముళ్లు ఉన్న మొక్కలు, పాలు కారే మొక్కలను పెంచకూడదు. చిన్న చెట్లను తూర్పు, ఉత్తర దిక్కుల్లో పెంచండి. పెద్ద చెట్లను పడమర, దక్షిణ దిక్కుల్లో పెంచాలి. మర్రిచెట్టు, రావిచెట్టులాంటివాటిని పెంచొద్దు
తులసి అత్యంత పవిత్రమైన మొక్క.
ఇది ఇంట్లో ఉంటే ఐశ్వర్యం పెరుగుతుంది.
తూర్పు, ఈశాన్యం, ఉత్తర దిక్కుల్లో పెంచాలి.
ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది.
ఆగ్నేయ దిక్కులో పూల మొక్కలు పెట్టండి.
మనీప్లాంట్ ఆరోగ్యం, ఆర్థికం, శ్రేయస్సు కోసం పెట్టండి.

తూర్పు, ఉత్తర దిక్కుల్లో అశోక చెట్టును పెంచండి.
ఎటువంటి వివాదాలు రావు.
కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది.
ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి.
నిమ్మ, నారింజ చెట్లు వాస్తు దోషాలను, అనారోగ్యాలను, నరఘోషను తొలగిస్తాయి.
తూర్పు, ఆగ్నేయంలో లక్కీబాంబును పెంచాలి.
దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
కుటుంబంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
మందారం, గులాబీ, మల్లె వంటి మొక్కలు సమస్యలను తొలగిస్తాయి.
మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి.
నాగజెముడు, బ్రహ్మజెముడు, కాక్టస్ మొక్కలను అసలు పెంచకూడదు.
జిల్లేడు, ఉమ్మెత్త లాంటి పాలుకారే మొక్కలు కూడా పెంచకూడదు.
వీటినుంచి నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.












Click it and Unblock the Notifications