వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది
వాస్తు ప్రకారం శనివారం రోజు కొన్ని పనులు చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటారు. చాలామంది శని అంటే భయపడుతుంటారుకానీ ఆయన చాలా మంచి చేస్తాడు. జీవిత పాఠాలను నేర్పుతాడు. వాస్తు ప్రకారం కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తుంటే శనిదేవుడి నుంచి వచ్చే దోషాల నుంచి చాలా సులువుగా బయటపడొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
సింహద్వారం వద్ద ఆవనూనెతో దీపం వెలిగించాలి.
ఆరోజు ఉప్పు, నల్ల నువ్వులు, ఇనప వస్తువులు కొనొద్దు.
నమ్మరసం, పసుపు కలుపుకొని స్నానం చేయాలి.
పేదలకు అన్నదానం చేయాలి.
శనిదేవుడికి నల్లనువ్వులు, నువ్వుల నూనె సమర్పించాలి.
ఇవన్నీ చేయడంవల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి.
మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు.

శనికి నలుపు, నీలం అంటే ఇష్టం.
చమురు, ఇనుము, యంత్రాలు, నిర్మాణ రంగంలో
ఉన్నవారికి శనిదేవుడి వల్ల మంచి స్థాయి కలుగుతుంది.
ఆయన అనుగ్రహం ఉంటే అత్యున్నత స్థాయికి చేరుకుంటారు
కాకులకు ఆహారం పెట్టాలి.
దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయి.
శనివారం చెప్పులు దానం చేయాలి.
దీనివల్ల పాదాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఆంజనేయుడిని పూజిస్తే శని దోషం అంటదు.
రావిచెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
ఇది చాలా మంచి పరిహారం.
భక్తితో శనిదేవుడిని పూజిస్తే మీరు ఊహించని మంచి ఫలితాలను పొందుతారు.












Click it and Unblock the Notifications