వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం మాత్రమే కాదు.. అది పంచభూతాల సమ్మేళనం. పునాది నుంచి పిట్టగోడ వరకు ప్రతిదీ శాస్త్రబద్ధంగానే ఉండాలి. పునాదులు, గోడల నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఆ ఇంట్లో నివసించే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంటి నిర్మాణంలో గోడలకు ఉన్న ప్రాముఖ్యత, వాస్తు దోషాలు, వాటి నివారణ గురించి తెలుసుకుందాం.
ఇంటికి పునాది ఎంత బలంగా ఉంటే, ఆ ఇల్లు అంత సుస్థిరంగా ఉంటుంది.
వాస్తు ప్రకారం పునాది వేసేటప్పుడు నైరుతి మూల బరువుగా, లోతుగా ఉండాలి.
ఈ దిశలో పునాది బలహీనంగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు,
కుటుంబ యజమానికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ఇంటి బేస్‌మెంట్ ఎత్తు అనేది రోడ్డు మట్టం కంటే ఎక్కువగా ఉండాలి.
ఇలా లేకపోతే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.

గోడల నిర్మాణంలో చాలామంది చేసే పొరపాటు
అన్ని దిక్కులా ఒకే మందంతో గోడలు కట్టడం.
దక్షిణ, పశ్చిమ గోడలు తూర్పు, ఉత్తర గోడల కంటే ఎక్కువ మందంగా ఉండాలి. ఎత్తుగా కూడా ఉండాలి.
ఇది ఇంట్లోకి వెచ్చని కిరణాలను నిరోధించి, సానుకూల శక్తిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
తూర్పు, ఉత్తర గోడలు కాస్త పల్చగా ఉండాలి.
తద్వారా ఉదయం వచ్చే సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ధారాళంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
ఈ నియమం పాటించకపోతే మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
ఇంటికి ఆనుకొని ఇతరుల ఇళ్లు ఉన్నప్పుడు,
మన ఇంటి బేస్‌మెంట్, ప్రహరీ గోడలు స్పష్టంగా ఉండాలి.
ఇతరుల ఇంటి గోడను మన ఇంటికి ఆధారంగా చేసుకోకూడదు.
దీనివల్ల ఇతరుల ఇంట్లోని వాస్తు దోషాలు లేదా ప్రతికూల ప్రభావం మన ఇంటిపై పడుతుంది.
మిద్దెపై నిర్మించే పిట్టగోడలు కూడా వాస్తు పరిధిలోకి వస్తాయి.
నైరుతి వైపు పిట్టగోడ కొంచెం ఎత్తుగా ఉంచి,
ఈశాన్యం వైపు కొంచెం తక్కువ ఎత్తులో ఉంచడం మంచిది, శ్రేయస్కరం కూడా.
ఇది ఇంటి ఎనర్జీ బ్యాలెన్స్‌ను కాపాడుతుంది.
ఇంటి గోడలపై పగుళ్లు ఏర్పడటం వాస్తు రీత్యా అశుభం.
ఈశాన్య మూలలో పగుళ్లు ఉంటే అది ఆర్థిక నష్టాలకు, అనారోగ్యానికి సంకేతం.
వెంటనే వాటికి మరమ్మతులు చేయించడం చాలా మంచిది.












Click it and Unblock the Notifications