Vastu tips: మీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందా? అయితే ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!

ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని పెంచడానికి ఇంట్లో ఏ చిత్రాన్ని ఉంచాలో, ఏం చెయ్యాలో వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కొందరు వ్యక్తులు కొన్నిసార్లు ఏదో ఒక కారణంతో, కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా కలత చెందుతారు. చాలా నిరాశా నిస్పృహలను వ్యక్తం చేస్తారు. దీని కారణంగా వారి ఆత్మవిశ్వాసం మరియు నైతిక స్థైర్యం తో పాటు ఏదైనా కొత్త పని చేయాలనే ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యక్తుల చుట్టూ ఎల్లప్పుడూ సానుకూలత ఉండడం కోసం, వారు సంతోషంగా ఉండటం కోసం కొన్ని వాస్తు చిట్కాలను సూచించారు వాస్తు శాస్త్ర నిపుణులు.

 ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవటానికి ఈ పని చెయ్యండి

ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవటానికి ఈ పని చెయ్యండి

జీవితంలో ఆత్మవిశ్వాసం చాలా అవసరమని, కొన్ని సందర్భాలలో తెలియకుండానే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందని, అలా తగ్గకుండా ఎప్పుడు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు సాగాలంటే మనం ఇంట్లో అటువంటి సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఇంట్లో మనల్ని చైతన్యవంతులను చేసే చిత్రాలను పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక మన చుట్టూ ఎప్పుడూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవటం కూడా అంతే ప్రధానం అని చెప్తున్నారు.

ఈ చిత్రాలు ఇంట్లో పెట్టుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

ఈ చిత్రాలు ఇంట్లో పెట్టుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని పెంచడానికి, ఎత్తైన పర్వతం లేదా ఎగిరే పక్షి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఒక పక్షి కొత్త గమ్యాన్ని వెతుక్కుంటూ పర్వతాన్ని వెతుక్కుంటూ ఆకాశంలో ఎగురుతున్నట్లే, అది తుఫాను అయినా, ఎటువంటి ప్రకృతి విపత్తు అయినా, ఎల్లప్పుడూ తన స్థానంలో స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో అటువంటి చిత్రాలను చూడడం వల్ల ఆ వ్యక్తి లో విశ్వాసం, ధైర్యం గణనీయంగా పెరుగుతుంది.

ఉదయించే సూర్యుడి చిత్రం, సూర్యారాధన ఆత్మవిశ్వాసం పెంచుతుంది

ఉదయించే సూర్యుడి చిత్రం, సూర్యారాధన ఆత్మవిశ్వాసం పెంచుతుంది

మీ గదిని ఉదయించే సూర్యుని చిత్రంతో లేదా నడుస్తున్న గుర్రంతో అలంకరించండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇంటి నుండి ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. గుర్రం లోపలికి పరుగెత్తే విధంగా ఉండాలి. ఇక ఇదే సమయంలో ఖాళీ గోడకు ఎదురుగా ఎప్పుడూ కూర్చోకండి, ఎందుకంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, ఉదయాన్నే నిద్రలేచి ఉదయించే సూర్యుడిని ఆరాధించండి. రోజూ ‘ఆదిత్య హృదయ స్తోత్రాన్ని' పఠించండి. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి నీటిని సమర్పించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆత్మవిశ్వాసం పెరగాలంటే జంతువుల పట్ల సానుకూల దృక్పధం ఉండాలి

ఆత్మవిశ్వాసం పెరగాలంటే జంతువుల పట్ల సానుకూల దృక్పధం ఉండాలి

ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశ వైపుకి తిరిగి కూర్చునేలా చూడండి. పక్షులకు ఆహారం మరియు నీరు ఇవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. ఆవులకు పచ్చి మేత తినిపించండి. అలాగే, కుక్కలకు ఆహారం పెట్టడం మరియు వాటిని ప్రేమించడం ద్వారా కూడా మీలో ధైర్యం పెరుగుతుంది. ఇంట్లో చేపలను పెంచండి. వాటిలో గోల్డెన్ ఫిషెస్ ఉండేలా చూసుకోండి. ఇక ఇంటి కిటికీలు తెరిచి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.

చుట్టూ పాజిటివ్ వైబ్ ఉండే వ్యక్తులే ఉండేలా చూసుకోండి

చుట్టూ పాజిటివ్ వైబ్ ఉండే వ్యక్తులే ఉండేలా చూసుకోండి


ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవటం కోసం ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తులతో ఉండకండి. ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతారు. ఎప్పుడూ సానుకూల దృక్పథం మనిషిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనం చేసే పనిలో విజయాన్ని సొంతం చేస్తుంది. కాబట్టి మీ చుట్టూ ఉండే మనుషులు అయినా, మీ చుట్టూ ఉండే వాతావరణమైనా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా చూసుకోండి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+