వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: దక్షిణం దిశ వాస్తు విషయంలో జాగ్రత్త.. ఈ వస్తువులు పెడితే సర్వనాశనమే!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో ప్రతి దిక్కుకు తమదైన స్థానం ఉంటుంది. దక్షిణం దిక్కుకు కూడా చాలా ప్రాధాన్యత ఉందని వాస్తు శాస్త్రం వెల్లడించింది. దక్షిణం దిక్కుకు అధిపతి యముడు, అంతే కాదు దక్షిణం దిక్కును కాలం చేసిన పూర్వీకుల దిక్కుగా కూడా చెబుతారు. కాబట్టి ఈ దిక్కు విషయంలో వాస్తు నియమాలను పాటించకపోతే ఇంట్లో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

దక్షిణం దిశలో పూజగది, స్టోర్ రూమ్ నిర్మిస్తున్నారా? జరిగేదిదే

దక్షిణం దిశలో పూజగది, స్టోర్ రూమ్ నిర్మిస్తున్నారా? జరిగేదిదే

దక్షిణం దిక్కులో గదులను నిర్మించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా ఇంట్లో పూజ మందిరాన్ని దక్షిణం వైపు నిర్మించకూడదు. దక్షిణం వైపు పూజగది నిర్మిస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. దక్షిణం దిక్కు మరణించిన పూర్వీకుల దిక్కు కావడంతో ఈ దిక్కున పూజగది నిర్మాణం మంచిది కాదని చెబుతున్నారు. ఇక దక్షిణం వైపు స్టోర్ రూమ్ నిర్మాణం కూడా ఏమాత్రం మంచిది కాదు. స్టోర్ రూమ్ ఎప్పుడు దక్షిణం వైపు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరణించిన పూర్వీకుల దిక్కు అయిన దక్షిణ దిక్కులో స్టోర్ రూమ్ ఉన్నట్లయితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ దక్షిణం వైపు స్టోర్ రూమ్ ను నిర్మిస్తే పూర్వీకులను అవమానించినట్లేనని, కుటుంబంలో ఎప్పుడూ ఆందోళనకర పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు.

దక్షిణ మధ్య భాగంలో పడకగది ఉందా? ఈ ఇబ్బందులు తప్పవు

దక్షిణ మధ్య భాగంలో పడకగది ఉందా? ఈ ఇబ్బందులు తప్పవు

ఇంట్లో పడక గది కూడా నైరుతి భాగంలో ఉండొచ్చు కానీ, దక్షిణం భాగంలో ఉండకూడదు. ఒక దిక్కును మూడు భాగాలుగా విభజిస్తే మధ్యలో ఉన్న భాగాన్ని ప్రధాన దిక్కుగా మనం గుర్తిస్తాం. ఉదాహరణకు దక్షిణ దిక్కును మూడు భాగాలుగా విభజిస్తే నైరుతి, దక్షిణం, ఆగ్నేయం మూడు భాగాలుగా చూస్తాం. అందుకే నైరుతి భాగంలో పడకగది ఉండొచ్చు కానీ దక్షిణ మధ్య భాగంలో వచ్చేలా పడకగది ఉండకూడదు. ఒకవేళ అలా పడకగది ఉంటే తరచూ నిద్రకు భంగం కలుగుతుంది. సంపూర్ణంగా నిద్ర పోలేని పరిస్థితి ఉంటుంది. ఆ గదిలో నిద్రించేవారు అనారోగ్యాల బారిన పడతారు. ఇలా దక్షిణ మధ్య భాగంలో పడకగది నిర్మాణం పితృ దోషాలకు కూడా దారితీస్తుంది.

దక్షిణంలో వంటగది, బాత్ రూమ్.. చెప్పుల స్టాండులు పెడుతున్నారా? సమస్యలు ఇలా

దక్షిణంలో వంటగది, బాత్ రూమ్.. చెప్పుల స్టాండులు పెడుతున్నారా? సమస్యలు ఇలా

వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ భాగంలో వంటగది లేదా స్టవ్ ను ఉంచకూడదు. దక్షిణ భాగంలో వంటగదిని నిర్మాణం చేస్తే కుటుంబ సభ్యులు అనారోగ్యాల బారిన పడతారు. దక్షిణంలో వంటగది ఉన్న వారి జీవితంలో అడుగడుగునా సమస్యలే ఎదురవుతాయి. ఇక దక్షిణ భాగంలో బూట్లు, చెప్పులు పెట్టకూడదు. చనిపోయిన పెద్దలకు కేటాయించే దక్షిణ దిశలో బూట్లు చెప్పుల కోసం స్టాండ్లు పెట్టడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. దక్షిణ భాగంలో బాత్రూంలను నిర్మించకూడదు. దక్షిణం వైపు అగ్ని మూలకంగా ఉంటుంది. అగ్ని మూలకంగా ఉన్నచోట బాత్రూంలను నిర్మించడం వల్ల నీరు ప్రవహిస్తుంది. దీనివల్ల సంపద తరిగిపోతుంది. ఎంత కష్టపడినా, సంపాదించింది మొత్తం ఏదో రకంగా ఖర్చయిపోతూ ఉంటుంది. జీవితంలో మనకు వచ్చే విజయాలను కూడా దక్షిణం వైపు చోటు చేసుకునే వాస్తు దోషాలు హరించి వేస్తాయి

దక్షిణ దిశలో వాషింగ్ మెషీన్లు, యంత్రాలు పెడుతున్నారా? అయితే అన్నీ కష్టాలే

దక్షిణ దిశలో వాషింగ్ మెషీన్లు, యంత్రాలు పెడుతున్నారా? అయితే అన్నీ కష్టాలే


దక్షిణ దిశలో వాషింగ్ మెషీన్లు, యంత్రాల వంటి సామాన్లను పెట్టకూడదు ఇది కూడా మనకు నష్టం చేస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి నశించి ప్రతికూల శక్తి ఆదిపత్యాన్ని చలాయిస్తుంది. దక్షిణం దిక్కులో వాస్తు నియమాలను పాటించకుండా తప్పులు చేస్తే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, దక్షిణ దిక్కులో చేసే తప్పుల వల్ల ఆర్థిక నష్టం తో పాటు, ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే దక్షిణం దిశ విషయంలో, దక్షిణం వైపు పెట్టే వస్తువుల విషయంలో తస్మాత్ జాగ్రత్త.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Astrology: ఇలాంటి కలలతో ఆస్తి, ఐశ్వర్యం మీసొంతం.. మీకు వస్తున్నాయా.. చెక్ చేసుకోండి!!Astrology: ఇలాంటి కలలతో ఆస్తి, ఐశ్వర్యం మీసొంతం.. మీకు వస్తున్నాయా.. చెక్ చేసుకోండి!!

English summary
Do not place some objects and constructions of puja room, kitchen, bathroom etc in the south direction even by mistake, if you do that you will defenitely to face problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X