సాయి పల్లవికి బిగ్ షాక్.. ఆ మూవీ నుంచే !!
టాలీవుడ్ ప్రేక్షకులకు లేడి పవర్ స్టార్ సాయి పల్లవి.. ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుణ్ తేజ్ "ఫిదా" తో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరో స్థాయిలో ఫిదా చేసిన సాయి పల్లవి.. ఆపై పలు పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఎంసీఏ, పడి పడి లేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించి నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన "అమరన్" సినిమా ఘనవిజయం సాధించింది. అలాగే తెలుగులో నాగచైతన్యతో కలిసి నటించిన "తండేల్" కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసిన ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

'రామాయణ'లో సీతగా..
ప్రస్తుతం సాయి పల్లవి నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ "రామాయణ" లో ఆమె సీతదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు రూ.1600 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇది రెండు భాగాలుగా రూపొందుతుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్, దక్షిణాది స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సీత పాత్రకు కావాల్సిన అమాయకత్వం, సంప్రదాయ సౌందర్యం, హావభావాలు సాయి పల్లవిలో ఉన్నాయని భావించిన చిత్ర బృందం ఆమెను ఎంపిక చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని లుక్ టెస్టులు, సెట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల సాయి పల్లవి బాలీవుడ్‌లో 'ఏక్ దిన్' సినిమాతో అరంగేట్రం చేసింది. జూనైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
ఈ సినిమా ఫెయిల్యూర్‌కు కారణాలపై చర్చ జరుగుతుండగా, సాయి పల్లవి హిందీ డబ్బింగ్‌పై వచ్చిన విమర్శలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె హిందీ ఉచ్చారణలో దక్షిణాది యాస ఎక్కువగా వినిపించిందని కొందరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో డైలాగ్ డెలివరీ అంత ప్రభావం చూపలేదని విమర్శలు వినిపించాయి. ఇదే అంశం ఇప్పుడు 'రామాయణ' నిర్మాతలను ఆలోచనలో పడేసిందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీత పాత్రకు స్వచ్ఛమైన, గ్రాంధిక హిందీ అవసరమని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సాయి పల్లవి పాత్రకు వేరే ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ వినిపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారట.
సాయి పల్లవికి పెద్ద షాకేనా?
సాధారణంగా సాయి పల్లవి తన సినిమాల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఆమె నటనలో స్వరం కూడా ఒక ముఖ్యమైన భాగంగా అభిమానులు భావిస్తారు. అందుకే ఇప్పుడు డబ్బింగ్ మార్పు వార్తలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే కొందరు సినీ విశ్లేషకులు మాత్రం, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లలో భాష, డైలాగ్ డెలివరీ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం సహజమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications