Vastu tips: వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చైనా ఈ వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనుక్కోండి!!

వాస్తు శాస్త్రంలో వీధిపోట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. ఎవరైనా ఎక్కడైనా ఇంటిని కొనుగోలు చేయాలన్నా, స్థలాన్ని కొనుగోలు చేయాలన్నా ఆ ఇంటికీ లేదా స్థలానికి ఉన్న వీధిపోటు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి వీధిపోటు లేకుండా చతురస్రాకారంలో, తూర్పువైపు, ఉత్తరం వైపు రోడ్డు ఉన్న స్థలాలను కొనుగోలు చేయడం ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ఒకవేళ వీధిపోటు ఉంటే అది ఏ దిశలో ఉన్న వీధి పోటు అనేది గుర్తించాలని, చెడు ప్రభావాలను కలిగించే వీధిపోట్లు ఉన్న స్థలాలని మినహాయించి, మంచి ఫలితాలనిచ్చే వీధిపోటు ఉన్న ఇళ్లను, స్థలాలను కొనుగోలు చేయవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఈ రెండు వీధిపోట్లతో అన్నీ శుభాలే

ఈ రెండు వీధిపోట్లతో అన్నీ శుభాలే

ఉత్తర వాయువ్య వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, తూర్పు ఆగ్నేయ వీధి పోటు, పశ్చిమ నైరుతి వీధిపోటు, మంచివి కావని చెప్తారు.ఇక ఈ వీధి పోటులు ఉంటే అటువంటి స్థలాలను కొనుగోలు చెయ్యకూడదని చెబుతారు. ఇక మంచి వీధిపోట్ల జాబితాలోకి తూర్పు ఈశాన్య వీధి పోటు, ఉత్తర ఈశాన్య వీధి పోటు వస్తాయని చెబుతున్నారు. ఈ రెండు వీధిపోట్లు ఉన్న స్థలాలను కొనుగోలు చేయవచ్చని, గృహాలను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. ఈ వీధి పోట్లు ఆ కుటుంబానికి మంచి చేస్తాయని, అనేక శుభ ఫలితాలను ఇస్తాయి అని చెబుతున్నారు.

ఉత్తర ఈశాన్య వీధి పోటుతో సిరిసంపదలు మీ ఇంటికే

ఉత్తర ఈశాన్య వీధి పోటుతో సిరిసంపదలు మీ ఇంటికే


ఉత్తర ఈశాన్య వీధి పోటు విషయానికి వస్తే, ఉత్తర ఈశాన్య వీధి పోటుతో ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్న కుటుంబానికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఎంతో శుభప్రదమని, లాభదాయకమైనదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీధిపోటు ఇంటిని సిరి సంపదలతో తులతూగేలా చేస్తుందని చెబుతున్నారు. ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉన్న ఇంట్లో నివసించే దంపతులు ఎంతో సంతోషంగా ఉంటారని అన్యోన్యమైన దాంపత్యాన్ని సాగిస్తారని చెబుతున్నారు.

 ఈ వీధిపోటు ఉన్న ఇంట్లో ఉంటే సమాజంలో మంచి పేరు

ఈ వీధిపోటు ఉన్న ఇంట్లో ఉంటే సమాజంలో మంచి పేరు


ఇక కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయని, అందరూ సఖ్యతతో ఉంటారని చెబుతున్నారు. ఇంట్లో చిరాకులకు ఆస్కారం ఉండదని అంటున్నారు. ఇక స్త్రీలు, పురుషులు అన్న భేదం లేకుండా ఉత్తర ఈశాన్య వీధిపోటు ఉన్న గృహస్థులు అన్నింటా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సమాజంలో వీరికి త్వరగా గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉన్న స్థలాన్ని కాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చి అయినా కొనుగోలు చేసుకుంటే అంతకుమించిన అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు.

 తూర్పు ఈశాన్య వీధిపోటుతో కలిగే ఫలితాలివే

తూర్పు ఈశాన్య వీధిపోటుతో కలిగే ఫలితాలివే


తూర్పు ఈశాన్య వీధి పోటు వల్ల కలిగే ఫలితాలను చూస్తే తూర్పు ఈశాన్య వీధి పోటు గృహంలో నివసించే పురుషుల పైనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంటా బయటా వీరిదే పైచేయి అన్నట్టుగా పురుషులు శక్తివంతులుగా ఉంటారు. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్లినా మంచి పేరు ప్రతిష్టలు వీరు పొందగలుగుతారు. తూర్పు ఈశాన్య వీధి పోటును, వీధిశూలను శుభప్రదమైనవిగా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి వీధి పోటు ఉన్న స్థలంలో గృహనిర్మాణం చేయడం ఆమోదయోగ్యమైనదిగా సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+