APSRTC ప్రైవేటీకరణపై తాడోపేడో..! కాసేపట్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటన..!
ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)లో విద్యుత్ బస్సులు తీసుకురావడం, వాటి నిర్వహణకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవడం, వారికి ఆర్టీసీ డిపోలు అప్పగించడం వంటి చర్యలు ఉద్యోగ, కార్మికుల్లో ఆగ్రహం నింపుతున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే గళం విప్పుతున్న ఉద్యోగులు.. ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేకపోవడంతో దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో కీలక భేటీ నిర్వహిస్తున్నాయి.
ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న వివిధ ఉద్యోగ సంఘాల్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి జేఏసీగా ఏర్పడటం ద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఇప్పటికే గుర్తింపు సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ నిర్ణయించాయి. ఈ రెండు సంఘాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న భేటీకి ఇతర సంఘాల్ని కూడా ఆహ్వానించాయి. వీరంతా కలిసి ఒకే జేఏసీగా ఇవాళ ఏర్పడబోతున్నారు. అనంతరం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు.

ఆర్టీసీలో ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్ బస్సులను నడిపించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ-విద్యుత్ బస్సులు కొనుగోలుకు ప్రవేటు ఆపరేటర్లకు కేంధ్రప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రాష్ట్రప్రభుత్వం,ఆర్టీసి యాజమాన్యం తీసుకొని ఆర్టీసి సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రవేటు ఆపరేటర్లకు విధ్యుత్ బస్సులతో పాటు విలువైన డిపోల స్దలాలను పూర్తిగా లీజు పేరుతో కట్ట బెట్టే ప్రయత్నాలను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీర్ఘకాలికంగా ఆర్టీసిలో ఉన్న సమస్యలు,స్త్రీ-శక్తి పధకంవలన ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపైనా ఇవాళ భేటీలో చర్చిస్తారు.












Click it and Unblock the Notifications