Vastu tips: కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలా? అయితే ఇంట్లో ఈ వాస్తుదోషాలు కారణం కావచ్చు!!
కుటుంబంలో తగాదాలు, వాదనలు సర్వసాధారణం కానీ మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ప్రారంభిస్తే అలాంటి ఘర్షణలు ఖచ్చితంగా మంచివి కావు. ఈ గొడవల వెనుక చాలా కారణాలు ఉండవచ్చు కానీ కుటుంబంలో సామరస్యం ఉండేలా వాటిని అంతం చేయడం ముఖ్యం. అయితే ఇంట్లో నిత్యం గొడవలు కావడం వెనుక వాస్తు దోషాలు కూడా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మానవ జీవితానికి సానుకూలతను ఇచ్చేలా వాస్తు శాస్త్రాన్ని రూపొందించారు. వాస్తు శాస్త్ర నియమాలు పాటిస్తే తప్పక సుఖశాంతులతో కూడిన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఇల్లు శుభ్రంగా లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు, అన్నీ ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఉండాలంటే ప్రతి ఒక్కరూ చిరాకు పడడం జరుగుతూ ఉంటే కచ్చితంగా ఆ ఇంట్లో వాస్తుదోషాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం, కుటుంబంలో శాంతిని నెలకొల్పడానికి మీ ఇంటిని సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ, మీరు ఇంటిని, ప్రతి మూలను సరిగ్గా శుభ్రం చేయకపోయినా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి.

ఈశాన్యంలో వాస్తుదోషం ఉంటే తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ
మీ ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు చక్కగా ఉండాలి. ఏదైనా మూలలో ధూళి, చిందరవందరగా ఉంటే, అది మీ కుటుంబ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది .అంతేకాదు గొడవలకు దారితీస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, తండ్రి మరియు కొడుకుల మధ్య గొడవలకు అతిపెద్ద కారణం ఇంట్లో ఈశాన్య మూలలో ఉండే వాస్తు దోషం. ఈశాన్య మూల వాస్తు దోషం ఉంటే కచ్చితంగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతాయి. ఈశాన్య మూలలో ఏది పడితే అది పెట్టినా, ఆ ప్రభావం మన జీవితం పైన ఉంటుంది. కాబట్టి వీటన్నింటి నుంచి బయటపడాలంటే ఇంటి ఈశాన్య దిక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఈశాన్యంలో డస్ట్ బిన్ ఉన్నా డేంజర్ .. కుటుంబంలో ఒకరిపై ఒకరికి అసూయ
అలాగే, డస్ట్‌బిన్‌ను ఎప్పుడూ ఈశాన్యదిశలో ఉంచకూడదు. చీపుర్లు, బరువైన వస్తువులు ఏవి ఉన్నా ఆ చిరాకు చెప్పనలవి కాదు. ఎప్పుడూ ఈశాన్యమూలలో ఖాళీగా ఉంచాలి. లేదంటే నీటికి సంబంధించి వస్తువులను పెట్టొచ్చు. నీరు తప్ప ఈశాన్యంలో ఏది పెట్టినా ఇది ఇంటి సభ్యుల మధ్య విభేదాలకు దారితీస్తుంది. ఈశాన్య మూలలో పెట్టకూడని వస్తువులు పెట్టడం వల్ల కుటుంబ సభ్యులలోనే ఒకరిపై ఒకరికి అసూయ కలుగుతుంది. మీ ఇంట్లో ఎక్కడపడితే అక్కడ విపరీతంగా బూజు పేరుకుపోతే వాస్తు శాస్త్రం ప్రకారం, సాలీడు గూడు మీ ఇంట్లో రాహువు ప్రభావాన్ని సూచిస్తుంది.

ఇంట్లో సాలెగూడు రాహువుకు ఆగమనం .. కలహాలకు బూజు శుభ్రం చెయ్యకపోవటం కారణం
బూజు ఎంతగా పెరుగుతుందో, కుటుంబ స్థితిలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఇంట్లో బూజు లేకుండా చూసుకోవడం వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఒకవేళ ఇంట్లో ఎక్కడపడితే అక్కడ బూజు ఉంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరుగుతాయి. మీ ఇంటి ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉన్నట్లయితే, ఈ రకమైన వాస్తు దోషం ఇంటి అధిపతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీంతో ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. ఇది ఏ రకంగానూ మంచిది కాదు. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ వైపు లేకుండా చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న దోషాలే కుటుంబ సభ్యుల మధ్య చిరాకులను కలిగిస్తాయి. కాబట్టి వాస్తు నియమాలు తెలుసుకుని జాగ్రత్తగా పాటిస్తే కాస్త అయినా సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది.












Click it and Unblock the Notifications