vastu tips: అత్తా కోడళ్ళ మధ్య గొడవలా? ఈ వాస్తుచిట్కాలతో వారి మధ్య సఖ్యత!!

సాధారణంగా ప్రతి ఇంట్లోనూ అత్తాకోడళ్ల మధ్య గొడవలు రావడం అనేది సర్వ సాధారణం. అయితే ఈ గొడవలు పెద్దవైతే ఇంట్లో ఉండే అందరికీ చిరాకు కలిగిస్తుంది. ఎంతో మంది పురుషులు ఇటు తల్లికి, భార్యకు మధ్య సర్దిచెప్పలేక, వాళ్ల సమస్యలు పరిష్కరించలేక సతమతమౌతూ ఉంటారు. అయితే అత్తా కోడళ్ళ మధ్య గొడవలు తగ్గాలంటే, వారిద్దరి మధ్య సఖ్యత పెరగాలంటే కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అత్తా కోడళ్ళ మధ్య బంధం బలపడాలంటే అత్తమామలకు నైరుతి దిశలో ఉన్న గదిని ఇస్తే మంచిది.ఇంటికి నైరుతి దిశలో ఎల్లప్పుడూ అత్త గారి గది ఉంటే అత్తా కోడళ్ళ మధ్య కలహాలు రావని చెబుతారు.అంతేకాదు ఈశాన్య దిశ ఇంటికి ముఖ్యమైన దిశ .ఈ దిశలో చెత్త డబ్బా పెడితే అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి. కనుక పొరపాటున కూడా ఈశాన్య దిశలో డస్ట్ బిన్ లేకుండా చూసుకోవాలి.

: Fight between mother in law and daughter-in-law

ఈశాన్య దిశలో చెత్త పేరుకుపోతే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు, గొడవలకు ఇది కారణంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ తులసి పూజ చేయడం వల్ల, ఇంట్లో దీపం వెలిగించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గౌరవం పెరుగుతుంది .అత్తా కోడళ్ళ మధ్య పరస్పర అవగాహన, ప్రేమనూ ఇది పెంచుతుంది.

అత్తా కోడళ్ళ మధ్య వాగ్వివాదాలు ఎక్కువగా జరిగితే వారి గదుల్లో రెడ్ కలర్ ఫోటో ఫ్రేమ్ లను పెట్టి అందులో అత్తా కోడలు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు పెడితే వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో కిచెన్ క్యాబినెట్ రంగు నలుపు రంగు అయితే కూడా అత్తా కోడళ్ళ మధ్య గొడవలు పెరుగుతాయి. నలుపురంగు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచుతుంది. కాబట్టి వెంటనే ఆ రంగు మార్చాలని సూచిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో అత్తాకోడళ్ల మధ్య అనుబంధం బలపడాలంటే, ఇద్దరు గొడవలు పెట్టుకోకుండా ఉండాలి అంటే ఇంట్లో చందనపు విగ్రహం ఉండటం వల్ల అత్తా కోడళ్ళ మధ్య ఘర్షణలు తగ్గి ఇద్దరి మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో అందరికీ కనిపించే విధంగా చందనపు విగ్రహం పెట్టుకోవడం వల్ల కుటుంబం అంతా సఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య ఘర్షణలు తగ్గి, వారిరువురి మధ్య ప్రేమ పెరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+