Vastu tips: పెళ్లైన మహిళలు పొరబాటున కూడా ఈ దిశలో పడుకోకండి; కష్టాల్లో పడతారు!!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఏ విధంగా అయితే నిర్మించుకుంటామో అదేవిధంగా ఇంట్లో వస్తువుల నిర్వహణను కూడా చూసుకుంటాం. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పాటించవలసిన ముఖ్యమైన నియమాలలో మరొకటి ఏ పనిని ఏ దిశలో ఉండి చేయాలి అనేది. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం జాగ్రత్తలు పాటించకపోతే, వాస్తు నియమాలు పాటించకపోతే తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, కొన్ని దిశల వైపు కాళ్లు పెట్టి నిద్రించడం వల్ల దురదృష్టం వెన్నంటి వస్తుందని చెబుతున్నారు.

 పడుకునేటప్పుడు దక్షిణం వైపు కాళ్ళు పెడుతున్నారా? అయితే తీవ్ర ఫలితాలు

పడుకునేటప్పుడు దక్షిణం వైపు కాళ్ళు పెడుతున్నారా? అయితే తీవ్ర ఫలితాలు

పడుకునేటప్పుడు దక్షిణం వైపు కాళ్ళు పెట్టి నిద్ర పోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు ఎప్పుడో చెప్పారు. దక్షిణ దిశకు యముడు పాలకుడు కావడంతో ఆ దిశ వైపు కాళ్ళు పెట్టి నిద్రించడం యముడికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అని చెప్తున్నారు. దక్షిణదిశలో పాదాలు పెట్టి నిద్రించుట వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, వయస్సు తగ్గిపోతుందని, మరణ భయం వెంటాడుతుంది అని చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా దక్షిణ దిశ వైపు కాళ్ళు పెట్టి నిద్రించకూడదు అని సూచిస్తున్నారు.

పెళ్ళైన మహిళలు ముఖ్యంగా జాగ్రత్త

పెళ్ళైన మహిళలు ముఖ్యంగా జాగ్రత్త

ముఖ్యంగా వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. ఇక పెళ్ళయిన మహిళలు దక్షిణం దిశలో కాళ్ళు పెట్టి నిద్రిస్తే జీవితంలో ఊహించని దరిద్రం వచ్చిపడుతుందని అంటున్నారు. అన్నిటికంటే కష్ట సమయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, అతి పెద్ద సమస్యలో పడతారని చెప్తున్నారు. అందుకే పెళ్ళయిన మహిళలు పొరబాటున కూడా దక్షిణం దిశలో కాళ్ళు పెట్టి పడుకోకూడదని అంటున్నారు.

ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి పడుకుంటున్నారా? ఈ విషయం మీ కోసమే

ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి పడుకుంటున్నారా? ఈ విషయం మీ కోసమే

ఇక చాలామంది దక్షిణం వైపు తల పెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి నిద్ర పోవచ్చు అని భావిస్తూ ఉంటారు. కానీ ఇది కూడా వాస్తు దోషానికి కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరం వైపు కుబేరుడు పాలకుడుగా ఉంటాడు. కుబేరుడు వైపు కాళ్ళు పెట్టి నిద్రిస్తే సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని కోపం వస్తుంది. ఇది ఉత్తర దిశలో ఉన్న సానుకూల తరంగాలను ప్రతికూలంగా మారుస్తుంది. ఇది మీ ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఉత్తరదిశ వైపు కాళ్ళు పెట్టి పడుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని విషయాన్ని గుర్తించి ఆ దిశలో పడుకోకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. అయితే దీనికి ఆడవారి విషయంలో మినహాయింపు ఉంది అని చెబుతున్నారు.

పెళ్ళయిన మహిళలు ఆ దిశలో పడుకుంటే ఎన్నో ఫలితాలు

పెళ్ళయిన మహిళలు ఆ దిశలో పడుకుంటే ఎన్నో ఫలితాలు

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లి కాని యువతులు నైరుతి దిశలో పాదాలు ఉండేలా పడుకొని నిద్రపోకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో పాదాలు పెట్టి నిద్రించడం పెళ్లి కాని వారికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. తూరుపు దిశలో తలపెట్టి నిద్రించటం మంచిదని సూచిస్తున్నారు. పెళ్లయిన ఆడపిల్లలు ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి నిద్రించడం శుభప్రదమని సూచిస్తున్నారు. ఇక పెళ్లైన స్త్రీలు పడమటి దిశలో పడకూడదని, ఉత్తరం పడమర కలిసే వాయువ్య దిశలో పడుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఈ దిశలో పడుకోవడం వల్ల స్త్రీలకు విపరీతమైన వస్తు వాంఛ పెరుగుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+