వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: ఇంట్లోనూ, బంధువులతోనూ గొడవలా? కారణాలు ఇవే కావచ్చు; జాగ్రత్త!!

|
Google Oneindia TeluguNews

కొంతమంది ఎంత వాస్తు నియమాల ప్రకారం ఇల్లు కట్టుకున్నా తెలిసి తెలియక చేసే చిన్న చిన్న వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఎంత సంతోషంగా జీవితాన్ని సాగించాలని భావించినా ఏవో అనవసరపు గొడవలు ఎప్పుడూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయిన వాళ్ళతో విభేదాలు రావడం, స్నేహితులతో ఘర్షణ పడటం, ఆకస్మాత్తుగా దూరం పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం వంటి పరిస్థితులు అనేకమార్లు జరుగుతూ ఉంటాయి. అనవసరంగా పంచాయితీలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇటువంటి వారు వాస్తు దోషం వల్లనే ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. సకాలంలో దోషాలను గుర్తించి నివారణోపాయం చూస్తే తప్ప ఈ చికాకు నుంచి విముక్తి లభించదు.

Vastu tips: ఈ వీధిపోటు ఉంటే గొర్రెతోక బెత్తెడన్నట్టే జీవితం.. అన్నీ అపజయాలే!!Vastu tips: ఈ వీధిపోటు ఉంటే గొర్రెతోక బెత్తెడన్నట్టే జీవితం.. అన్నీ అపజయాలే!!

కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య తరచూ గొడవలా? కారణాలివే కావచ్చు

కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య తరచూ గొడవలా? కారణాలివే కావచ్చు

వాస్తు శాస్త్రం ప్రకారం చిన్నచిన్న వాస్తు నియమాలను పాటించక పోతే ఇంట్లో చిరాకులు పెరుగుతూ ఉంటాయి. బంధువులతోనూ మనస్పర్థలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో చీపురుని పెట్టే స్థానం నిర్దేశిత స్థానంలో ఉండకపోతే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. వంట గదిలో చీపురు పెడితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో పూజ గదిలో ఉండే విగ్రహాలను ఒకదానికొకటి ఎదురుగా పెడితే కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇంట్లో బల్బులు లేదా లైట్లు వాస్తు ప్రకారం నిర్దేశిత స్థానంలో లేకపోతే ఆ కుటుంబంలోని వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 పొరబాటున ఈ పని చేసినా గొడవలు వచ్చే అవకాశం

పొరబాటున ఈ పని చేసినా గొడవలు వచ్చే అవకాశం


అంతేకాదు ఇష్టమైనవారికి, స్నేహితులకు, బంధువులకు బహుమతులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులలోనూ పర్ఫ్యూమ్ ను ఎవరికీ గిఫ్టుగా ఇవ్వకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పొరపాటున కూడా ఎవరికీ కర్చీఫ్ ను గిఫ్ట్ గా ఇవ్వకూడదు. ఇష్టమైన వారి కర్చీఫ్ ను ఉపయోగించకూడదు. ఇటువంటివి చేస్తే అనవసరమైన తగాదాలు వచ్చి అసంతృప్తే మిగులుతుంది.

 గొడవలు రాకూడదు అని భావిస్తే ప్రధాన ద్వారం విషయంలో జాగ్రత్త...

గొడవలు రాకూడదు అని భావిస్తే ప్రధాన ద్వారం విషయంలో జాగ్రత్త...


వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు రోడ్డు కంటే ఎత్తులో ఉండాలి. అంతే కాదు ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చెత్తాచెదారం నిజము చేయకూడదు. ప్రధాన ద్వారానికి ఎదురుగా రహదారి ఉంటే ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి వచ్చి చేరుతుంది. ఎప్పుడు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, రోగాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రధాన ద్వారం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Quarrels at home and with relatives? Vastu Shastra experts say that the reasons may be minor Vastu Doshas. It is said that one should be careful about minor Vastu rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X