Vastu tips: అన్ని వీధిపోట్లు అశుభం కాదు; కొన్ని వీధిపోట్లే మహా డేంజర్.. అవేంటో తెలుసా!!

వాస్తు శాస్త్రంలో వీధిపోట్లను గురించి తెలుసుకోవడం చాలా ప్రధానమైన అంశం. సహజంగా వీధిపోటు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఆ ఇంటికి వీధిపోటు ఉంటే కొనుగోలు చేయకుండా వెనక్కి పోతారు. అయితే అన్ని వీధిపోట్లు ప్రమాదకరం కాదు, కొన్ని వీధిపోట్లు మాత్రమే ప్రమాదమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంతకీ యమడేంజర్ అనిపించే ఆ వీధి పోట్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తూర్పున వీధిపోటు ఉంటే కలిగే ఫలితమిదే
అసలు వీధిపోటు అంటే ఏమిటి మన ఇంటికి ముందు కానీ, పక్కన కానీ రోడ్లు ఉన్నప్పుడు, ఇంటికి ఎదురుగా నిలువైన వీధి ఉంటే దానిని వీధిపోటు అంటారు. ఇల్లు ఏ మూలలోనూ రోడ్డు మధ్యానికి పడకూడదు అన్నది వాస్తు శాస్త్రం చెబుతోంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు వీధి పోటు లేకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఇబ్బంది కలిగించే వీధిపోట్ల గురించి చెప్పుకోవాలంటే తూర్పు వైపున వీధిపోటు ఉంటే ప్రభుత్వంతో భయం కలుగుతుంది.

ఆగ్నేయం వీధిపోటు అనుకోని కష్టాలు, నైరుతి వీధిపోటుతో ఆరోగ్య నష్టాలు
ఆగ్నేయం వైపు వీధి పోటు ఉంటే అనుకోని కష్టాలు వస్తాయి. ఇంట్లో ఎంత డబ్బులు దాచి పెట్టాలని ప్రయత్నించినా ఆ ధనం నిలబడదు. ఆగ్నేయం వైపు వీధి పోటు ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. నైరుతి వీధి పోటు ఉంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ తీవ్రమైన మానసిక ఆందోళనకు లోనవుతుంటారు. అనుకోని ఖర్చులు ఊహించని విధంగా వచ్చి పడడంతో చేతిలో ఉన్న డబ్బులు ఎంత అనవసరంగా ఖర్చు అవుతుంది. ఇక నైరుతి వీధి పోటు ఉంటే ఏ పని ప్రారంభించినా అది పూర్తి కాదు.

Vastu tips: some street focus are very dangerous; know about these veedhi potu

దక్షిణమధ్య వీధిపోటు వల్ల మరణాలకు ఛాన్స్
ఇక ఉత్తర వాయువ్యంలో వీధి పోటు ఉంటే ఇంట్లోని స్త్రీలపై చెడు ప్రభావం కనబడుతుంది. గృహిణులకు తరచూ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి ఇక యువతులకు పెళ్లిళ్లు జరగవు. ఇంట్లో ఉన్న వారికి ఉద్యోగాలు కూడా తొందరగా రావు. దక్షిణ మధ్య వీధిపోటు వల్ల ధన నష్టం వాటిల్లుతుంది. కుటుంబంలోని వ్యక్తుల హత్యకు గురి కావడమో లేక ప్రమాదవశాత్తు చనిపోవడం జరుగుతుంది కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు.

Vastu tips: some street focus are very dangerous; know about these veedhi potu

పశ్చిమనైరుతి వీధిపోటు ఉంటే జరిగేదిదే
పశ్చిమ నైరుతి వీధిపోటు వల్ల ఇంట్లో నివసించే మగవాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ఉద్యోగులైతే ప్రమోషన్లు రాక, రాజకీయ నాయకులకు పదవులు రాక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అన్నిటికంటే దక్షిణ మధ్య వీధి పోటు యమడేంజర్ అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీధిపోట్లు ఈ విధంగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీధిపోట్లకు సంబంధించి నివారణోపాయాలను వాస్తు శాస్త్ర నిపుణులను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+