Vastu tips: ఈ అలవాట్లు మీ ఇంటికి దరిద్రదేవతను ఆహ్వానిస్తాయి.. మార్చుకుంటే ధనప్రవాహం!!
వాస్తు శాస్త్రం సానుకూల మరియు ప్రతికూల శక్తిపై ఆధారపడి ఉంటుంది. మీ ఇంటి ఆనందం మరియు శాంతి కూడా ఇంట్లో ఉండే సానుకూల శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీ దేవి శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది లేకుంటే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇళ్ళలో చేసే కొన్ని తప్పుల వల్ల కూడా వాస్తు దోషాలు
మీ పురోగతికి, ఇంటి సరైన వాస్తును కలిగి ఉండటం అవసరం. లేకపోతే మీరు ఎంత కష్టపడినా ఫలితం ఉండదని చెబుతున్నారు. వాస్తు లేని ఇంట్లో వాస్తు దోషాలు కలిగిన ఇంట్లో, తెలిసీతెలియక వాస్తుకు సంబంధించిన తప్పులు చేస్తున్న ఇంట్లో డబ్బు వృధా అవుతూనే ఉంటుందని చెబుతున్నారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే సుఖం, శాంతి ఉండదని, వాస్తు ప్రకారం, ఇళ్లల్లో వ్యక్తుల యొక్క కొన్ని అలవాట్లు వారి పురోగతికి అడ్డంకులు సృష్టిస్తాయని చెబుతున్నారు. ఇళ్లల్లో కొన్ని అలవాట్ల వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల ఇల్లు సుఖశాంతులతో ఉంటుందని చెబుతున్నారు.

ఇళ్ళలో మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఇవే
ఇక ఇళ్లల్లో మార్చుకోవాల్సిన అలవాట్ల విషయానికి వస్తే ఇంట్లో బీరువా పక్కన ఎప్పుడూ చీపురును పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. సంపద నిలవకుండా పోతుంది. చీపురును పెట్టడానికి కూడా నిర్దేశిత స్థానంలోనే పెట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇంట్లో ఏ మూలలోను మురికి ఉండకూడదు. ఈశాన్య దిశలో చెత్తాచెదారం ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసించదు. బూజు, చెత్తాచెదారం ఉన్న ఇల్లు దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది. కనుక ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంటి గుమ్మం దగ్గర చెత్త డబ్బాలు.. వంటగదిలో మందులు.. సమస్యలకు స్వాగతం
ఇక ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త డబ్బాలను పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించదు. ఇంట్లోని బాత్రూంల తలుపులు తరచుగా తెరిచి ఉంటే వర్తక వ్యాపారాలలో నిరంతర నష్టం వస్తూనే ఉంటుంది. పడక గదిలో పూజ మందిరం ఉంటే అది కుటుంబంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఇక వంటగదిలో మందులను ఉంచినట్లయితే, ఆరోగ్యం తరచుగా క్షీణిస్తుంది. నిత్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మంచం మీద కూర్చుని భోజనం చేస్తే ఇంట్లో శాంతి, సామరస్యాలకు భంగం కలుగుతుంది. కుటుంబ సభ్యులపై అప్పుల భారం పెరుగుతుంది.

ముళ్ళు, పాలుకారే చెట్లు ఇంట్లో ఉన్నాయా? పిల్లలు ఆ పని చేసినా తప్పే!!
ఇంట్లో తెల్లటి పాలు కారే చెట్లు, ముళ్ల మొక్కలు ఉంటే కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వీటివల్ల ధననష్టం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఇంట్లో దక్షిణ దిశలో అక్వేరియం పెడితే ఆదాయ వనరులు తగ్గిపోతాయి. ఇంట్లో చిన్నారులు గోడల పైన నేల పైన గీతలు గీయడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది. అది అప్పుల బాధను మరింత పెంచుతుంది. ఇక ఇళ్లల్లో ఇలాంటి అలవాట్లను మార్చుకుంటే ఆర్థిక నష్టాల నుంచి కష్టాల నుంచి బయట పడతారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications