Vastu tips: రోగాలకు వాస్తుకు లింక్; డయాబెటిస్, బీపీ ఉన్నవాళ్ళు ఈ పని చెయ్యొద్దు!!

మన ఆరోగ్యానికి వాస్తు శాస్త్రానికి లింక్ ఉంటుంది. సరైన వాస్తు మనకు ఆరోగ్యం ఇస్తుంది. వాస్తు సంబంధించిన దోషాలు ఉంటే అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అనేక అనారోగ్య సమస్యలకు వాస్తు నివారణలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు కొన్ని చిన్న చిన్న వాస్తు నివారణ లను పాటిస్తే కొంతమేర వాటి నుండి ఉపశమనం పొందొచ్చు. అలా అని పూర్తిగా మందులు లేకుండా రోగాలు తగ్గుతాయి అని దీని అర్థం కాదు అనే విషయం కూడా గుర్తించాలి.

డయాబెటిస్, బీపీ ఉన్నవారు ఆదిశలో పడుకోవద్దు

డయాబెటిస్, బీపీ ఉన్నవారు ఆదిశలో పడుకోవద్దు


ముఖ్యంగా డయాబెటిస్ బారినపడి బాధపడుతున్నవారు పడుకునేటప్పుడు ఇంటికి తూర్పు దిశ, ఆగ్నేయ దిశకు మధ్య భాగంలో నిద్రించటం ఏ మాత్రం మంచిది కాదు. ఒకవేళ అలా నిద్రిస్తే ఖచ్చితంగా రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ వ్యాధులు ఉన్నవారు మరింత తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి పొరబాటున కూడా ఆ దిశలో పడుకోకూడదు.

అనేక రోగాలకు ఈ వాస్తు దోషాలే కారణం

అనేక రోగాలకు ఈ వాస్తు దోషాలే కారణం


పడమర, వాయవ్య దిశలలో పడకగది ఉంటే తీవ్రమైన డిప్రెషన్ వస్తుంది. మాదక ద్రవ్యాల వ్యసనం, ఆత్మహత్య ధోరణులు కలుగుతాయి. ముఖ్యంగా ఈ దిశలు పిల్లలకు చాలా డేంజర్ అని చెప్పవచ్చు . అంతేకాదు ఇంటికి ఈశాన్య దిశలో మరుగుదొడ్లు ఉండడం వల్ల నరాల సంబంధిత సమస్యలు వస్తాయి. దక్షిణ, ఆగ్నేయ భాగాల మధ్య మరుగుదొడ్డి ఉంటే కండరాల బలహీనత కు కారణమౌతుంది.

ఈశాన్యం, దక్షిణం ఈ దిశల విషయంలో జాగ్రత్త

ఈశాన్యం, దక్షిణం ఈ దిశల విషయంలో జాగ్రత్త


ఇక ఇంటికి ఈశాన్య భాగంలో వంటగది ఉంటే అది రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా ఇంటికి ఈశాన్య భాగంలో వంటగదిని నిర్మించుకోవడం మంచిది కాదు. ఇంటికి ఆగ్నేయంలోనే వంటగది ఎప్పుడూ శ్రేయస్కరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దక్షిణదిశను తెరిచి ఉంచడం తీవ్రమైన వాస్తు దోషం. దక్షిణ దిశ ఓపెన్ గా ఉంటే అనేక రకాలైన ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం పాడవుతుంది. అకాల మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ దక్షిణ దిశను మూసి ఉంచాలి. పొరపాటున కూడా దక్షిణదిశ విషయంలో అజాగ్రత్త మంచిది కాదు.

మానసిక రుగ్మతలు, అనారోగ్య సమస్యలకు ఈ దిశలో పడక కారణం

మానసిక రుగ్మతలు, అనారోగ్య సమస్యలకు ఈ దిశలో పడక కారణం


ఇక ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రక రకాల ఆందోళనలు, మానసిక శారీరక రుగ్మతలు తొలగుతాయి. కాబట్టి పొరపాటున కూడా ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదు. ఎప్పుడూ పడుకునే విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలి. వాస్తు శాస్త్రం నియమానుసారం ఇటువంటి చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది మీరు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+