వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: ఇల్లు ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి!!

|
Google Oneindia TeluguNews

వాస్తు అనేది ఇంటికి ప్రశాంతతను తీసుకురావడంలో సరైన భూమిక పోషిస్తుంది. కాబట్టి వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తిని మెరుగుపరచుకోవచ్చు . సరైన వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో ప్రశాంతత వెల్లివిరుస్తుంది . ముఖ్యంగా ఎటువంటి వాస్తు నియమాలు ఇంటికి ప్రశాంతతను తీసుకు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశద్వారం వద్ద గణేషుడిని ప్రతిష్ఠిస్తే అది ఇంటికి శ్రేయస్సును, శాంతిని తీసుకువస్తుంది. చాలా మంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఖాళీగా ఉంచుతారు. కానీ అక్కడ ఏమైనా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యటం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇంట్లో శాంతి కోసం, వాస్తు నివారణ ప్రకారం వివిధ వస్తువులను వాటికి కేటాయించిన ఖచ్చితమైన దిశలోనే ఉంచడం చాలా అవసరమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం గదుల నిర్మాణం .. రంగుల ఎంపికతోనూ ప్రశాంతత

వాస్తు ప్రకారం గదుల నిర్మాణం .. రంగుల ఎంపికతోనూ ప్రశాంతత

వాస్తు ప్రకారమే ఇంట్లో గదులు నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. ఆగ్నేయంలో వంటగది, ఇంటికి ఈశాన్యం లో పూజ గది, నైరుతి భాగంలోనే బెడ్ రూమ్... ఇలా ప్రతి ఒక్కటి వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం నిర్మించుకోవడం మంచిదని చెబుతున్నారు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ బయటకు పోయి, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో ప్రకాశవంతమైన లేత రంగుల తో ఇంటి గోడలకు పెయింట్ చేయాలని, లోతైన ముదురు రంగులను ఉపయోగించకుండా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తేనే పాజిటివ్ ఎనర్జీ

ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తేనే పాజిటివ్ ఎనర్జీ

ఇక ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే ఇంటి నిర్మించేటప్పుడు స్వచ్ఛమైన గాలి, సహజంగా ఇంట్లోకి ప్రవేశించే విధంగా తగినంత క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోకి వెంటిలేషన్ తప్పనిసరి అని సూచిస్తున్నారు. వెంటిలేషన్ బాగా ఉన్న ఇళ్ళల్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని, ఇంట్లో ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుందని తద్వారా కుటుంబంలో ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు.

ఇంట్లో బుద్ధ విగ్రహాలు, నైరుతిలో కుటుంబ ఫోటో ఫ్రేములు

ఇంట్లో బుద్ధ విగ్రహాలు, నైరుతిలో కుటుంబ ఫోటో ఫ్రేములు

ఇంట్లో శాంతి మరియు సామరస్యం కోసం, ప్రశాంత వాతావరణం కోసం బుద్ధుడి విగ్రహాలను ఉంచడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతున్నారు. ఇంట్లో కనీసం ఒక బుద్ధ విగ్రహం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. బుద్ధ విగ్రహాలను కూడా సరైన దిశలో, సరైన స్థలంలో ఉంచితే ఇంట్లో శాంతి, సామరస్యం, సంపద పెరుగుతాయి అని సూచిస్తున్నారు. అంతేకాదు ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మధ్య ప్రేమానురాగాలు కొనసాగాలంటే ఇంట్లో నైరుతి గోడపై కుటుంబం యొక్క ఫోటో ఫ్రేమ్ లను పెట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుందని సూచిస్తున్నారు.

సీలింగ్ విషయంలోనూ జాగ్రత్త

సీలింగ్ విషయంలోనూ జాగ్రత్త

ఇక ఇదే సమయంలో ఇంటి సీలింగ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి గదిలోనూ ఇంటి సీలింగ్ నాలుగు మూలలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. గది సీలింగ్ లో పొరపాటున కూడా ఐదు మూలలు ఉండకూడదు. మీరు మీ ఇంటి గదులను అలాంటి పద్ధతిలో నిర్మిస్తే, గది యొక్క ప్రతికూల ప్రభావాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సీలింగ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇలా వాస్తు విషయంలో అనేక జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా ఫలితం మెరుగ్గా ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Want a peaceful home? But Vastu Shastra experts say that Vastu rules should be followed to bring positive energy in a small house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X