vastu tips: ప్రశాంతమైన నిద్ర, మెరుగైన ఆర్ధికస్థితి కావాలా? పడుకునేటప్పుడు ఈ పనులు చెయ్యండి!!
సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వాస్తు శాస్త్రంలో అనేక వాస్తు చిట్కాలు సూచించబడ్డాయి. వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి ఆనందం మరియు అదృష్ట జీవితాన్ని గడపవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే సమయంలో కొన్ని వస్తువులను ఏ విధంగా అయితే దగ్గరగా ఉంచుకోరాదు అని చెప్పారో, అదేవిధంగా కొన్ని వస్తువులను తల దగ్గర పెట్టుకుంటే ప్రశాంతమైన నిద్ర వస్తుందని, అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు.

రాత్రి పడుకునేటప్పుడు కచ్చితంగా దీనిని దగ్గరగా పెట్టుకోండి
వాస్తు శాస్త్రం ప్రకారం, నిద్రించే సమయంలో, మంచం దగ్గర నీటితో నింపిన చెంబును ఉంచి, ఉదయాన్నే ఏదైనా చెట్టు లేదా మొక్కలో ఈ నీటిని పోయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని చెంబులో ఉన్న నీళ్లు గ్రహిస్తాయి అని చెబుతున్నారు. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటామని సూచిస్తున్నారు.

దిండు కింద ఈ వస్తువులను పెట్టుకోండి
చాలామంది నిద్రపోయే సమయంలో ఉలికిపడి లేస్తూ ఉంటారు. లేదా భయానకమైన కలలు కంటూ కలవరపాటుకు గురవుతుంటారు. ఈ కారణంగా వారు సరిగా నిద్ర పోలేక ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇక అటువంటి వారికోసం వాస్తు శాస్త్ర నిపుణులు పడుకునే సమయంలో దిండు కింద ఇనుప కత్తిని లేదా కత్తెర ను పెట్టుకొని పడుకోవాలని సూచిస్తున్నారు. ఇనుప కత్తి లేదా కత్తెర నెగటివ్ ఎనర్జీని ఆకర్షించి నిద్రాభంగం లేకుండా చూస్తుంది. కాబట్టి నిద్రపోయే సమయంలో దిండు కింద ఇనుముతో చేసిన వస్తువులను పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

వెల్లుల్లి అదృష్టానికి చిహ్నం... దీనిని ఎలా వాడతారంటే
వాస్తు శాస్త్రంలో వెల్లుల్లిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. మీకు తక్కువ నిద్ర పోతున్నా, లేదా సరిగా నిద్ర పోలేక పోతున్నా, రాత్రివేళల్లో ఆందోళనకు గురవుతున్నా, నెగటివ్ ఎనర్జీ కారణంగా బాధపడుతున్నా , రాత్రి పడుకునేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలను దిండు కింద పెట్టుకొని పడుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇది చుట్టూ మరింత సానుకూల శక్తిని సృష్టిస్తుందని చెబుతున్నారు.

ఉప్పు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది
ఇక అంతే కాదు రాత్రిపూట సరిగా నిద్ర పో లేక పోతున్న వారు, నిద్రపట్టక ఇబ్బంది పడుతున్న వారు, రాత్రి సమయాల్లోనే మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్న వారు పడకగదిలో మూలలో ఉప్పు పోయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుందని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో జాతకంలో రాహు దోషం ఉన్నవారు, రాహు దోషం పోగొట్టుకోవడానికి కొద్దిగా స్వప్న కాగితంలో చుట్టి దిండు కింద పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇవి చెడు కలలు దూరంచేసి, ఒత్తిడి తగ్గిస్తుందని చెబుతున్నారు

చిన్నయాలుకలు చాలా పవర్ ఫుల్.. వీటితో ఇలా చెయ్యండి
వాస్తు శాస్త్రంలో చిన్న ఏలకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని దిండు కింద ఉంచడం ద్వారా, మనిషికి మంచి నిద్ర వస్తుంది మరియు దీనితో పాటు ఆర్థిక, మానసిక మరియు శారీరక సమస్యలు తొలగిపోతాయి. అందుచేత చిన్న ఏలకులను నిద్రపోయేటప్పుడు దిండు కింద పెట్టుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మంచి నిద్రను ఆస్వాదించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటామని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications