vastu tips: ఈశాన్యం తగ్గి వాయువ్యం పెరిగితే ఏం చేయాలి?
ఇంటి నిర్మాణం విషయంలో ప్రతి చిన్న అంశం కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. లేదంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఆర్థిక, మానసిక, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెప్తోంది. తూర్పు ప్రధాన ద్వారంతో ఇల్లు నిర్మించేటప్పుడు ఈశాన్యం తగ్గడం, వాయువ్యం పెరగడం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అలాగే దక్షిణ, పడమర దిక్కుల్లో రోడ్లు ఉన్న స్థలంలో ఇల్లు ఎలా కట్టుకోవాలి? అనే అంశాలపై వాస్తు నిపుణులు చెబుతున్న సూచనలను తెలుసుకుందాం.
సంపద నిలవదు
తూర్పు ప్రధాన ద్వారం ఉన్న ఇంటికి కాంపౌండ్ వాల్ ఈశాన్యం వైపు తక్కువగా ఉండి, వాయువ్యం వైపు ఎక్కువగా ఉండటం వాస్తు ప్రకారం తీవ్రమైన దోషంగా పరిగణించబడుతుంది. ఈశాన్యం దేవ మూల, లక్ష్మీ స్థానం కావడం వల్ల అది తగ్గితే సంపద నిలవకపోవడం, సంతాన అభివృద్ధి తగ్గడం లేదా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలాగే వాయువ్యం పెరగడం వల్ల అనవసర ఖర్చులు, కోర్టు కేసులు, మానసిక అశాంతి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ దోషాన్ని నివారించడానికి కాంపౌండ్ వాల్‌ను సరిచేసి, స్థలాన్ని కచ్చితమైన దీర్ఘచతురస్రాకారం లేదా చతురస్రాకారంలోకి మార్చుకోవాలి. హెచ్చుతగ్గులు ఉన్న వాయువ్య స్థలాన్ని కాంపౌండ్ బయట వదిలేసి, సమాంతరంగా కాంపౌండ్ గోడను నిర్మించుకోవాలి.

దక్షిణ - పడమర కార్నర్ పాయింట్
ఇక దక్షిణ, పడమర దిక్కుల్లో రోడ్లు ఉన్న స్థలాన్ని వాస్తులో నైరుతి చూపు స్థలం లేదా దక్షిణ-పశ్చిమ కార్నర్ ప్లాట్ అంటారు. ఇలాంటి స్థలంలో ఇల్లు నిర్మించేటప్పుడు ఇంటికి ఉత్తరం, తూర్పు దిక్కుల్లో ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదిలి, దక్షిణం, పశ్చిమ దిక్కుల్లో చాలా తక్కువ స్థలం మాత్రమే వదులుకోవాలి. అంతేకాకుండా పశ్చిమ, దక్షిణ కాంపౌండ్ గోడలు ఎత్తుగా, మందంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి నిర్మాణాన్ని నైరుతి మూల నుంచి ప్రారంభించి, ఆ భాగాన్ని అందరికంటే ఎత్తుగా ఉంచాలి.
ఈశాన్యం వైపు పల్లంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక ప్రధాన ద్వారం విషయానికి వస్తే, ఈ రకమైన ప్లాట్‌కు మెయిన్ డోర్‌ను దక్షిణ వాయువ్యం లేదా దక్షిణ సెంటర్‌లో ఏర్పాటు చేసుకోవాలి. లేదా పశ్చిమ వాయువ్యంలో కూడా ప్రధాన ద్వారాన్ని అమర్చుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ నైరుతి లేదా పశ్చిమ నైరుతిలలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయకూడదు, ఇది తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది.












Click it and Unblock the Notifications