Vastu tips: స్త్రీలు స్నానంచేసిన తర్వాతే ఈ పనులు చేయాలి.. లేదంటే ఇంట్లో దరిద్రమే!!

ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని హాయిగా గడపాలని కోరుకుంటారు. జీవితంలో దేనికీ లోటు ఉండకూడదు అని భావిస్తూ ఉంటారు. తమ జీవితం సంతోషంగా ఉండాలని దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే, ఈ సమయంలో, తెలిసీ తెలియక చేసే తప్పుల కారణంగా ఒక్కోసారి సత్ఫలితాలను పొందలేకపోతారు. అటువంటి పరిస్థితిలో, కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అటువంటి పొరపాట్లను నివారించవచ్చు. ముఖ్యంగా స్త్రీలు కుటుంబాన్ని నడిపించే బాధ్యతలో కీలక భూమిక పోషిస్తారు. ఇక అటువంటి స్త్రీలు కొన్ని నియమాలను గురించి తెలుసుకుంటే ఆ ఇంటికి లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

ఇంట్లో కొన్ని పనులు స్నానం చేసిన తరువాతనే చేయాలి

ఇంట్లో కొన్ని పనులు స్నానం చేసిన తరువాతనే చేయాలి

చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా అనే రకరకాల పనులు చేస్తుంటారు. అయితే స్నానం చేయకుండా కొన్ని పనులు చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు స్నానం చేసిన తర్వాతనే కొన్ని పనులు చేయాలని, స్నానం చేసి ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, కుటుంబంలోని వారంతా సంతోషంగా ఉంటారని సూచించబడింది. ఇక స్నానం చేసిన తర్వాత మహిళలు చేయాల్సిన పనుల వివరాలను చూస్తే

 స్నానం చేయకుండా డబ్బు ముట్టుకుంటే జరిగేది ఇదే

స్నానం చేయకుండా డబ్బు ముట్టుకుంటే జరిగేది ఇదే

మహిళలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. అందుకే ఉదయాన్నే మహిళలు స్నానం చేసి పనులకు ఉపక్రమించాలని పెద్దలు చెబుతారు. స్నానం చేయకుండా డబ్బులు పట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని నమ్ముతారు. లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడే డబ్బును స్నానం చేసిన తర్వాత ముట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

స్నానం చేయకుండా ఆ మొక్కలను తాకరాదు

స్నానం చేయకుండా ఆ మొక్కలను తాకరాదు

ఇక అలాగే మహిళలు స్నానం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్క మీద చెయ్యి వేయకూడదు. తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారని చెబుతున్నారు. ప్రతి ఇంటిలోను తులసి మొక్కను నాటడం, తులసిని పూజించడం చాలా శుభప్రదమని చెబుతుంటారు. ప్రతి రోజు పూజ చేసిన తర్వాత మహిళలు, తులసి మొక్కకు నీళ్ళు పోసి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. అందుకే పొరపాటున కూడా ఎప్పుడుబడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు. స్నానం చేసిన తర్వాతనే తులసి మొక్కలకు నీళ్లు పోయాలి.

 స్నానం చేయడానికి ముందే జుట్టు దువ్వుకుంటున్నారా? అయితే కష్టాలే

స్నానం చేయడానికి ముందే జుట్టు దువ్వుకుంటున్నారా? అయితే కష్టాలే

కొంతమంది స్నానం చేయడానికి ముందే జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని, ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చి చేరతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే జుట్టు దువ్వుకునే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలని, తర్వాతనే తల దువ్వుకోవాలి అని, అప్పటివరకు తలలో దువ్వెన పెడితే మంచిది కాదని సూచిస్తున్నారు.

 స్నానం చేయకుండా వంట గదిలోకి వెళుతున్నారా? అనారోగ్యం బారిన పడతారు జాగ్రత్త

స్నానం చేయకుండా వంట గదిలోకి వెళుతున్నారా? అనారోగ్యం బారిన పడతారు జాగ్రత్త


స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళకూడదని, వంట చెయ్యకూడదని సూచిస్తున్నారు. ప్రస్తుతం బిజీ లైఫ్ లో చాలామంది మహిళలు స్నానం చేయకుండా వంట చేస్తున్నారు. అంతే కాదు స్నానం చేయకుండా బ్రేక్ ఫాస్ట్, భోజనం కూడా తీసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని సూచించబడింది. స్నానం చేయకుండా వంట చేస్తే, ఆహారం తీసుకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్నానం చేయకుండా వంట చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుందని అంటున్నారు. మహిళలు ఎల్లప్పుడూ స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లి ఆహారం సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. అలా కాకుండా స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్తే అన్నపూర్ణ దేవిని అవమానించినట్టు అవుతుందని, అన్నం దొరకని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+