అష్టమ శనితో 2025 ఈ రాశివారికి నరకం తప్పదన్న వేణు స్వామి!

2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉండబోతుందో వేణు స్వామి వెల్లడించారు. ఇక సింహరాశి వారిని జాతకం చెప్పిన వేణు స్వామి ఈ సంవత్సరం సింహరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు, పుబ్బ నక్షత్రం 1 2 3 4 పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు సింహరాశి జాతకులు.

సింహరాశి వారికి 2025 జాతకం ఇలా
ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11 వ్యయం 11 రాజపూజ్యం 3 అవమానం 6 ఉంటుంది. ఈ సంవత్సరం సింహరాశి జాతకులకు అష్టమ శని ప్రారంభమవుతుంది. దీంతో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ సమయంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారు. విదేశాలలో ఉన్న విద్యార్థుల వీసా రిజెక్ట్ కావడం తిరిగి స్వదేశానికి రావటం, ఉత్తీర్ణత శాతం తగ్గడం, ఫెయిల్ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

Venu Swamy says that leo zodiac sign will see hell in 2025 with the ashtama shani

వీరికి కష్టాలు,, అడుగడుగునా నష్టాలు
అష్టమ శని కారణంగా సింహరాశి విద్యార్థులు మానసికంగా ఇబ్బందిని ఎదుర్కొంటారు. విదేశాలలో ఉన్న విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం రాక నరకాన్ని చూస్తారు. ఇక స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరినైతే నమ్ముతారో వారు మోసం చేస్తారు. ఊహించని విధంగా ఈ సంవత్సరం దగ్గర వారితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

ఉద్యోగులకు ఈ ప్రమాదం
కుటుంబంలో దగ్గర వారు ఈ సంవత్సరం మరణించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఏమాత్రం కలిసి రాదు. ట్రాన్స్ఫర్స్ అనుకున్న ప్రదేశానికి జరగవు. ప్రమోషన్లు ఉండవు. పై అధికారుల టార్చర్ పెరిగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు ఏసీబీ రైడ్స్ అయ్యే అవకాశం ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ లు ఏసీబీ, సిబిఐ, ఈడి లాంటి కేసులలో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

రూపాయి వస్తే పది రూపాయల ఖర్చు.. జాగ్రత్త
సినిమా రంగంలో ఉండే వారికి చాలా అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు కానీ ఆర్థికంగా రూపాయి వస్తే పది రూపాయల ఖర్చు ఈ సంవత్సరం అందరికీ కనిపిస్తుంది. సింహరాశి వారు డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పోలీసులు, కోర్టు కేసులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది .అలాగే రైతులకు ఈ సంవత్సరము దిగుబడి రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది.

రాజకీయ నాయకులు బీ కేర్ ఫుల్
క్రీడాకారులకు సంబంధించి రాజకీయాల వల్ల మీకు అవకాశాలు దక్కకపోవచ్చు . రాజకీయ నాయకులకు సంబంధించి చాలా నెగిటివ్ గా ఉండే పరిస్థితి ఉంది. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. కానీ అనుకున్న పదవులు ఏమి దక్కకపోవచ్చు .ఈ సంవత్సరం పోటీ చేసేవారు ఓడిపోయే అవకాశం ఉంది.

సింహరాశి వారు ఈ పరిహారాలు చెయ్యండి
సింహరాశి జాతకులు శనివారం నియమాన్ని పాటించండి. శనివారం పూట రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి. వీలైతే శనివారం నాడు బ్లూ కలర్ బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. వీటివల్ల చాలా వరకు సమస్యల తీవ్రత తగ్గుతుంది. అలాగే తిరు నల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకుంటే అష్టమ శని వల్ల కలిగే సమస్యల నుండి బయటపడతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+