అద్భుత మాలవ్య రాజయోగం ప్రకటించింది వీరికి ఊహించని ధనయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రయాణం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం వివిధ రాశులలో గ్రహాలు సృష్టించే రాజయోగాలు కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. పంచ మహాపురుష రాజు యోగాలలో ఒకటిగా భావించే మాలవ్య రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది.
మాలవ్య రాజయోగం
శుక్ర సంచారం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు జాతకంలోని మొదటి నాలుగు, ఏడు, పదో ఇంట్లో ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇక మాలవ్య రాజయోగం అక్టోబర్ ఒకటో తేదీన ఏర్పడుతున్న నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఈ రాశుల వారి అదృష్టం మారుతుంది. 85ఏళ్ళ తర్వాత ఈ ఖగోళ దృగ్విషయం జరుగుతుంది. ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

మేష రాశి
తుల రాశిలో శుక్ర సంచారంతో ఏర్పడే మాలవ్య రాజయోగం కారణంగా మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది. జీవితంలోని ఒడిదుడుకులు దూరమవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. సొంతింటి కల నెరవేరుతుంది.
తులారాశి
మాలవ్య రాజయోగం కారణంగా తులా రాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు. ఈ సమయంలో వీరు నూతన గృహాలను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాలవ్య రాజయోగం కారణంగా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఈ సమయం వీరికి అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది.
కుంభరాశి
మాలవ్య రాజయోగం కారణంగా కుంభ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి అపారమైన లాభాలు వస్తాయి. ఇది కుంభ రాశి వారికి అదృష్ట సమయం.
మీన రాశి
మాలవ్య రాజయోగం కారణంగా మీన రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీన రాశి జాతకులు ఈ సమయంలో విందులు, వినోదాలలో పాల్గొంటారు. భార్య తరపున వారి నుంచి ఆస్తులు వచ్చి పడతాయి. మీనరాశి జాతకులకు ఈ సమయం శుభపరిణామాలకు వేదిక అవుతుంది. మీరు పడిన కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవించడానికి ఆస్కారం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications