శుక్రుడి ప్రత్యక్ష సంచారంతో ఈ రాశులవారికి విలాసయోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం తిరోగమన సంచారం చేస్తున్నాడు. జనవరి 28వ తేదీన తన ఉచ్చ రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మే 31వ తేదీ వరకు మీన రాశి లోనే ఉంటాడు. శుక్రుడు మార్చి రెండవ తేదీన తిరోగమనం చెందాడు. మొత్తం 43 రోజుల పాటు తిరోగమన స్థితిలో శుక్రుడు సంచారాన్ని సాగిస్తున్నాడు.
శుక్రుడి ప్రత్యక్ష సంచారం
శుక్రుడి తిరోగమన సంచారం ఏప్రిల్ 12వ తేదీతో పూర్తవుతుంది. ఏప్రిల్ 13 నుండి శుక్రుడు మళ్ళీ మీనరాశిలో ప్రత్యక్షంగా మారతాడు. ఇక మీన రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి విలాస యోగం వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి శుక్రుడి కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. శుక్రుడి ప్రత్యక్ష సంచారం ఈ రాశి వారికి లాభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. మిధున రాశి వారి ప్రేమ జీవితంలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా మిధున రాశి వారికి కలిసి వచ్చే సమయం.
ధనుస్సు రాశి
శుక్ర సంచారంతో ధనస్సు రాశి వారికి మేలు జరుగుతుంది. శుక్రుడు ప్రత్యక్ష సంచారం చేయడంతో ధనస్సు రాశి వారు సంపదలతో తులతూగుతారు. ఏప్రిల్ 13 నుండి వీరికి ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ధనుస్సు రాశి వారు సంతోషంగా ఉంటారు.
కుంభరాశి
శుక్రుడి ప్రత్యక్ష సంచారం కారణంగా కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఏ పనులు చేసిన లాభం వస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి . గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications