ఆర్థికంగా బలోపేతమవుతారు.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరించాలి
జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంది. దీన్ని రాశి పరివర్తనం అంటారు. తాజాగా ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాశిఫలాల ఫలితాలు ఎలా ఉన్నాయి? కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి? ఒకవేళ కష్టాలుంటే వాటిని నిపుణుల సలహాతో ఎలా అధిగమించాలి? తదితర విషయాలన్నింటిపై రాశులవారీగా వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నాలు, తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇష్టదేవతను స్మరించాలి.

వృషభ రాశి
వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోను మార్చొద్దు. ఉద్యోగంలో కష్టం ఉంది. పనులు వాయిదా వేయవద్దు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరించాలి.
మిథున రాశి
మనోబలంతో పనులు చేయాలి. మంచి ఆలోచనలు చేయడంవల్ల బంగారు భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. ఉద్యోగంలో మాత్రం మిశ్రమ ఫలితాలున్నాయి. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. సూర్య అష్టోత్తరం చదువుకోవాలి.
కర్కాటకం
అదృష్టం తోడుగా ఉంటుంది. అనుకూలమైన సమయం ఇది. వ్యాపారంలో లాభాలున్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా బలపడతారు. కొత్తగా చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. లక్ష్మీదేవిని స్మరించాలి.
సింహ రాశి
బుద్ధిబలంతో పనులు ప్రారంభించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. నమ్మకంతో పనిచేయాలి. దీనివల్ల ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. మొహమాటంతో ఇబ్బంది పడవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
కన్యా రాశి
విశేష ధనయోగం కనపడుతోంది. ఖర్చులు తగ్గించుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల స్థిరత్వం వస్తుంది. కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. నవగ్రహ శ్లోకాలను పఠించాలి.












Click it and Unblock the Notifications