ఈ రాశులవారికి ఈ వారం అన్నీ నష్టాలే..! మీ రాశి కూడా ఉందా?
జ్యోతిష్యం ప్రకారం ఈవారం బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి శుభ ప్రయోజనాలు, మరికొన్ని రాశులవారికి ప్రతికూలతలు ఎదురవుతాయి. ఈ యోగం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
మేష రాశి:
మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనసులో సంతోషం పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినవారికి లాభాలున్నాయి. ఎంత శ్రమ పడితే అంత ఫలితం లభిస్తుంది. ఆధునిక జీవనశైలిని అనుసరించేవారు జాగ్రత్తగా ఉండాలి. మితిమీరి వచ్చే కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎదుటివారితే మాట్లాడే సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభ రాశి:
కొన్ని సమస్యలవల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. మనసులో ప్రతికూలతలు పెరిగే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలుస్తారు. ఆహారంపట్ల ప్రేమ పెరుగుతుంది. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
సింహరాశి:
కుటుంబంతో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు. చిన్న చిన్న సమస్యలవల్ల ఓర్పును కోల్పోతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిరాశకు గురై ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పనిచేసేచోట అనేకరకాల ఇబ్బందులు వస్తాయి. మానసిక సమస్యల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది.
కన్యా రాశి:
కోరుకున్న పనులు నెరవేరతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అందుకు తగ్గట్లుగా పెట్టుబడులు కూడా పెరుగుతాయి. కళ, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. అత్యుత్సాహం పనికిరాదు.












Click it and Unblock the Notifications