ఫిన్‌టెక్ దిగ్గజంలో భారీ లేఆఫ్స్- వేల సంఖ్యలో ఉద్యోగుల కోత

గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వీసా (Visa) లేఆఫ్స్ కు తెర లేపింది. సంస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. వ్యాపార కార్యకలాపాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రవేశపెట్టడంతో పాటు అదనపు ఖర్చులను నియంత్రించుకోవడం, ఇతర వనరులపై భారీగా పెట్టుబడులు పెట్టానే ఉద్దేశంతో ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తమ మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్ లో దాదాపు ఏడు శాతం.. అంటే సుమారు 2,600 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ ఆకస్మిక నిర్ణయం ప్రభావం ప్రధానంగా కంపెనీలోని టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ విభాగాలపై చూపనుంది. లేఆఫ్స్ బారిన పడే వారిలో ఎక్కువ మంది ఈ విభాగాల్లోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయా టెక్కీలకు ఇమెయిల్స్ కూడా పంపినట్లు వీసా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ర్యాన్ మెక్‌ఇనెర్నీ తెలిపారు. దీనికి గల కారణాలను వివరించారు. డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీలో తమ టాప్ పొజీషన్ ను నిలబెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు పునర్నిర్మాణ మార్పులు అవసరమని, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అనివార్యమని అన్నారు.

Visa set to cut 2600 jobs as wider industry push to improve efficiency and redirect investment in AI

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఈ ఉద్యోగాల తొలగింపునకు కొంత మేర కారణమైందే తప్ప దీని వల్లే లేఆఫ్స్ ప్రకటించారనడంలో అర్థం లేదని ర్యాన్ వ్యాఖ్యానించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా సంస్థను పునర్వ్యవస్థీకరించాలనేదే తమ ఉద్దేశమని తేల్చి చెప్పారు. అధిక లాభాలు చేకూర్చే విభాగాల్లో పెట్టుబడులు పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను మెరుగుపర్చుకోవడం తప్పదని వ్యాఖ్యానించారు.

ఆగస్టు 1న వినాయక చవితి ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్: ఆ బెల్ట్ మొత్తం కవర్
ఆగస్టు 1న వినాయక చవితి ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్: ఆ బెల్ట్ మొత్తం కవర్

వీసా గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో దాదాపు 34,100 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. 2024 సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య దాదాపు ఎనిమిది శాతం పెరిగింది. రెండేళ్లుగా కంపెనీ అంచనాలను మించి నికర ఆదాయాన్ని నమోదు చేస్తూ వస్తోంది కూడా. అయినప్పటికీ.. లేఆఫ్స్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందటే వీసాకు ప్రధాన పోటీదారుగా ఉంటూ వస్తోన్న మరో ఫిన్ టెక్ కంపెనీ మాస్టర్‌కార్డ్ కూడా భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

పండగ సీజన్ ఆరంభంలో శుభసూచకం- దిగొస్తోన్న బంగారం ధరలు
పండగ సీజన్ ఆరంభంలో శుభసూచకం- దిగొస్తోన్న బంగారం ధరలు

ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందని విసా అంచనా వేస్తోంది. రోజువారీగా ఒకే తరహాలో సాగే పనుల వేగాన్ని పెంచడానికి, క్రెడిట్, డెబిట్ తదితర డిజిటల్ ప్రొడక్ట్స్ రూపకల్పనను వేగవంతం చేయడానికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఏఐ రాకతోనే ఉద్యోగాలను తొలగించట్లేదని, మానవ వనరుల స్థాయిని సమీక్షించుకోవడంలో భాగంగా మాత్రమే లేఆఫ్స్ కు వెళ్లాల్సొచ్చిందని ర్యాన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+