Viral Video: ప్లీజ్ పడవలు తీసుకురండి.. వాటర్ పార్క్‌గా మారిన మెట్రో స్టేషన్!
Viral Video: దేశంలోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్సాంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరోవైపు దేశరాజధాని ఢిల్లీ నగరంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడి పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. సాధారణంగా ఢిల్లీ మెట్రో అనగానే ప్రపంచ స్థాయి వసతలు, సమయపాలన, వర్షం. ట్రాఫిక్ గండం నుంచి కాపాడే సురక్షితమైన ప్రయాణంగా భావిస్తారు. కార్లు, బైకులు ఉన్నవారు కూడా వర్షంలో ప్రయాణించడానికి మెట్రోనే ఎంచుకుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఢిల్లీ మెట్రో పరిస్థితి కూడా దారుణంగా తయారైందని స్పష్టం అవుతోంది.
జలమయమైన జనక్‌పురి మెట్రోస్టేషన్
సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ వీడియో ఢిల్లీలోని జనక్‌పురి మెట్రో స్టేషన్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఆ వీడియోలో జనక్‌పురి మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ గేట్లు, స్టేషన్ కాంప్లెక్స్ అంతా నీటితో నిండిపోయి కనిపించింది. మెట్రో స్టేషన్ లోపల మెట్లు దిగుతున్న సమయంలో తీసిన మరో వీడియోలో నీళ్లు మెట్రో ఆవరణలోకి భారీగా చేరినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నీళ్లు మరీ లోతుగా లేనప్పటికీ.. ప్రయాణీకులు బయటకు వెళ్లాలంటే కచ్చితంగా తమ కాళ్లు, చెప్పులు తడుపుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

బస్సుల్లోనూ అదే పరిస్థితి
కేవలం ఢిల్లీలోని జనక్‌పురి మెట్రో స్టేషన్ మాత్రమే కాకుండా జులై 28న కురిసిన వర్షానికి ఢిల్లీలోని వీఐపీ ప్రాంతాలైన కన్నాట్ ప్లేస్ నుంచి ఐటీవో వరకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలో తిరిగే డీటీసీ బస్సుల్లోకి కూడా నీళ్లు చేరడంతో ప్రయాణీకులు సీట్లపై కాళ్లు పైకి పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. బస్సులోని ప్రయాణీకులు ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల దుస్థితిపై చర్చించుకోవడం ఆ వీడియోల్లో కనిపించింది.
ऐ वॉटर लॉगिंग तुझे जाना पड़ेगा!
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) July 29, 2026
वैसे ये बहुत शानदार वॉटर स्पोर्ट्स प्रतीत हो रहा है!
दिल्ली की सीएम रेखा गुप्ता को चाहिए कि वे इस विजुअल को #DelhiTourism की वेबसाइट पर डलवा दें। दुनिया में free publicity में free में योगदान करूँगा 😄 pic.twitter.com/RFQd4O9I40
ఫన్నీ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
ఆ దృశ్యాలను చూసిన నెటిజన్లు నెట్టింట రకరకాల కామెంట్లు చేస్తున్నారు. "ఇది జనక్‌పురి మెట్రో స్టేషన్ కాదు.. జనక్‌పురి వాటర్ పార్క్" అంటూ కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు సరదాగా "ఇక నడవలేం.. పడవలు తీసుకురండి!" అని కామెంట్లు పెడుతున్నారు. " మేము కడుతున్న ట్యాక్సుల డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి" అంటూ పలువురు నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా.. వర్షాల వేళ ఢిల్లీ నగరంలో ఎదురవుతున్న ఈ తరహా సమస్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications