వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆహార పదార్ధాలు ఆరోగ్య సూత్రాలు :అజీర్తికి ఎలాంటి చిట్కాలు పాటించాలి..?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

తినేప్పుడు తగినంత సమయం తీసుకుని తినాలి, నెమ్మదిగా తినాలి, ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ప్రాచీన ఆరోగ్య సూత్రాల ప్రకారం ఆహారం తినేప్పుడు మాట్లాడరాదు, మాట్లాడినా కూడా అతి తక్కువగా మాట్లాడాలి. మన శరీరంలోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో మలినంగా బయటికి వెళ్లిపోవాలి, అలాంటి ఆహార పదార్ధాలే తినాలి లేకపోతే జబ్బులు చేస్తాయి.

* మన శరీరంలోకి వెళ్ళిన నీరు 4 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి, లేకపోతే జబ్బులు. మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనం రోగగ్రస్థులం అవుతాం.

* మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే ఏమౌతుందో తెలుసా.. మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం. అందుకే ఋషులు అంటారు.. "మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న అమాయకులం.. నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీగా మరణిస్తున్నాం." మనకు వయసు పెరిగితే.. ఆయుష్షు తగ్గినట్టా లేక పెరిగినట్టా ?.. మనం ప్రతి రోజూ నెగెటివ్ ఎనర్జీలతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గమనించాలి.

* మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని.. మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని.. ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం ద్వారా ప్రాణశక్తిని ఎక్కువగా పొందుతూ నెగెటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలి.

What food to take for a healthy life,Here is the health formulae

* మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం ధ్యానం, యోగాయే అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు. రోజూ కనీసం అర గంట యోగా, ప్రాణాయామం, ధ్యానం, చేయండి ఆయురారోగ్యాలతో జీవించండి.

* ప్రతి వ్యక్తి తాను ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాడు, మరి ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం గురించి కొన్ని సార్లు తెలిసో తెలియకనో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అందుకే ఇక్కడ మనం కొన్ని అతి ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను తెలుసుకుందాం.

* ప్రతి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని 3 లేదా 4 గ్లాసులు త్రాగాలి, దీనివల్ల విరేచనమ్ సాఫీగా అయ్యి మలినాలు వెళ్లి పోతాయి. నీటిని కూర్చోని మాత్రమే తాగాలి.

* కాలకృత్యాలని బలవంతంగా ఆపుకోరాదు.

* తగినన్ని శుభ్రమైన నీటిని రాగి గ్లాసులో త్రాగాలి.

* ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతో బాటు ఎన్నో వ్యాధులు నయమవుతాయని పరిశోధనలు నిరూపించాయి. ఇష్టమయిన పని చేయడం వల్ల మానసిక ఉల్లాసం లభిస్తుంది. ఇష్టమయిన పుస్తకాలు చదవడం, ఇష్టమయిన సంగీతాన్ని వినడం, కుటుంబ సభ్యులతో గడపడం, అన్ని వేళల మానసికంగా బలంగా ఉండటం. తక్కువగా యంత్రాల మీద ఆధారపడటం. అవసరమయినపుడు వైద్యున్ని సంప్రదించడం. శరీర బరువును తగినంతగా ఉండేటట్టు చూసుకోవడం. వయస్సు ప్రకారం అలవాట్లు మార్చుకోవడం. ప్రతి 15 రోజులకు ఒక సారి ''ఏకాదశి' ఉపవాసం ఉండటం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా కొన్ని వ్యాధులు రాకుండా ఉండటానికి తగిన శక్తి మరియు ఉత్సాహం మన శరీరానికి వస్తుంది. అవసరాన్ని బట్టి గ్రీన్ టీ కానీ ఏదయినా హెర్బల్ టీ ని కానీ త్రాగండి.

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆరోగ్య సూత్రాలు :- ఆయుర్వేదం ప్రకారం రుతువులలో వచ్చే ఆహారాన్ని తీసుకోవాలి మరియు ఆయుర్వేదం లో చెప్పినట్టు మనిషి తన యొక్క శరీర తత్వాన్ని బట్టి " వాత, పిత్త, కఫ " వాటికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోవాలి.

* తీసుకున్న ఆహారం జీర్ణం కానపుడు ఈ చిట్కాని పాటించండి ఒక చెంచా తురిమిన అల్లంకు నిమ్మకాయ రసం మరియు కొంత ఉప్పు కలిపి త్రాగండి దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది .

* ఆహారాన్ని తగినంతనే తినాలి అతి ఎక్కువ అతి తక్కువ రెండు అనర్థమే, రోజుకు రెండు సార్లు మాత్రమే తినాలి, ప్రొద్దున మల్లి రాత్రి ప్రారంభ కాలంలో , ప్రతి భోజనానికి మధ్య 4 నుండి 6 గం సమయం ఉండాలి. రాత్రి 7 గం ల లోపు తినాలి. తొందరగా పడుకోవాలి మల్లి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.

What food to take for a healthy life,Here is the health formulae

ప్రొద్దున ఆహారం :- సగ భాగం ఘన ఆహారంతో.. పావు భాగం ద్రవ పదార్థంతో మిగితా పావు భాగం కాలి కడుపుతో ఉంచాలి.

రాత్రి సమయంలో :- పావు భాగం ఘన ఆహారంతో.. అర భాగం ద్రవ పదార్థంతో.. మిగితా పావు భాగం కాలి కడుపుతో ఉంచాలి.

* వయస్సు ప్రకారం మనిషి నిద్ర ఎంత సేపు పోవాలి అంటే..

4 నెలల నుండి 12 నెలల వయస్సు వరకు 12 నుండి 16 గంటలు నిద్ర పోవాలి.
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వయస్సు వారు 11 నుండి 14 గంటలు నిద్ర పోవాలి.
3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వయస్సు వారు 10 గంటలు నుండి 13 గంటలు నిద్ర పోవాలి.
6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయస్సు వారు 9 గంటలు నుండి 12 గంటలు నిద్ర పోవాలి.
13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు వారు 8 గంటలు నుండి 10 గంటలు నిద్ర పోవాలి.
18 సంవత్సరాల నుండి ఆ పై వయస్సు వాళ్ళు కనీసం 8 గంటలు నిద్ర పోవాలి. వయస్సు ఎక్కువయ్యే కొద్ది నిద్రపోయే సమయం తగ్గుతుంది కానీ ప్రతి వ్యక్తికి సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు.

* ఎలాంటి ఆహారం తినాలి అంటే.. మనిషి జీవించడానికి ప్రధానంగా ఆహారం అవసరం. ఆహారం తీసుకోవడానికి మనకు కొన్ని ప్రాచీన మరియు ఆధునిక పద్ధతులు నియమాలు అంటూ ఉన్నాయి. ఋతువుల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి సరిపడని విరుద్ధమైన ఆహారాన్ని అసలే తినకూడదు. ఆహారం పరిశుభ్రమైనవిగా, తాజావైనవిగా ఉండాలి. ప్రకృతి సహజంగా పండించిన ఆహారాన్నే తినాలి. కాయగూరలు, ఆకుకూరలు, పండ్లను మంచి దొడ్డుపు వేసిన నీటిలో కడిగిన తరవాతనే తినాలి వీలైతే ఉప్పు వేసి కడిగితే దాని మీద ఉన్న ఫంగస్, బ్యాక్టీరియా, పురుగు మందుల అవశేషాలు కొంత వరకయినా వెళ్లి పోతాయి. ఎక్కువ కాలం నిలువ ఉంచిన ఆహారాన్ని తినరాదు, ప్రతి పదార్థానికి జీవిత కాలం అనేది ఉంటుంది. చెడు వాసన వచ్చే ఆహారాన్ని అసలే తినరాదు. ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినాలి. బీర, తృణ ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఆకు కూరలు, చిలగడదుంప. ఆహారాన్ని ఎప్పుడు కూడా మన ఆరోగ్య సమస్యల ప్రకారమే తినాలి.

ఉదా :- మధుమేహం ఉన్నవాళ్లు తీపి కలిగిఉన్న పదార్థాలను తినకపోవడం మంచిది. గుండె సమస్యలు ఉన్నవాళ్లు బాదాం లాంటి పదార్థాలు తినడం వంటివి చేయాలి. నెమ్మదిగా తినాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తినేప్పుడు సద్భావన, భగవత్స్మరణతో నిర్మలమైన మనస్సుతో తినాలి. ఈ పద్దతులలో తింటే మనము తిన్నది శరీరానికి మేలు చేస్తుంది, తిన్న ఆహారం అరిగే వరకు ఆ భావనతోనే ఉండేలా దోహదపడుతుంది. మనం తినే స్థలము పరిశుభ్రంగా ఉండాలి, స్థిరాసనంలో కూర్చుని తినాలి.

ముఖ్యంగా ఆహారం తినేప్పుడు ఎక్కువగా నీళ్ళను త్రాగరాదు. అవసరం మేరకు కొంత త్రాగి తిన్న తరవాత కొంత సేపటికి 15 నిమిషాల నుండి 30 నిమిషాల తరవాతనే తగినంత నీటిని త్రాగితే తేలికగా జీర్ణం అవుతుంది. మనలో ఉన్న జఠరాగ్ని ఆహారాన్ని జీర్ణింప చేస్తుంది. ఆహారం ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది చల్లని ప్రదేశాలలో అనగా హిమాలయ పర్వత ప్రాంతాల వాళ్ళు ఆవనూనేను ఆహారంగా వాడతారు దానికి కారణం అక్కడి అతి చల్లని శీతోష్ణస్థితి. ఆవ నూనె శరీరానికి వేడిని ఇస్తుంది. ఆహారం తగినంత పోషకాలు కలిగినదై ఉండాలి. ఎప్పుడు ఒకే రకమయిన పదార్థాలు తినరాదు.

* వ్యాయామం :- మొట్ట మొదటగా వ్యాయామం ఎందుకు అనేది చూద్దాం, క్రమం తప్పని శారీరక శ్రమ వలన మన శరీర సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. శారీరక అంగాలు బలంగా తయారౌతాయి, శరీర సామర్థ్యం పెరుగుతుంది. శరీరానికి తగినంత ప్రాణ వాయువు ( ఆక్సిజన్ అందుతుంది ) దీని వల్ల చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు.

* వ్యాయామం అనేది ఎవరికి :- రాను రాను ఎన్నో కారణాలవల్ల మనుషులు బద్దకస్తులుగా తయారవుతున్నారు మన పూర్వీకులు.. 40 సంవత్సరాలకు పూర్వం మన వాళ్ళు అన్ని పనులకు నడిచే వెళ్లే వాళ్ళు. పాఠశాలలలో చదువుకునే వారు ఒక ఊరి నుండి ఇంకో ఊరికి కాలినడకతో నడిచి లేదా సైకిల్ ఉన్నవాళ్ళు సైకిల్ పై వెళ్ళేవారు. కాబట్టి నడక శారీరక శ్రమ అనేవి వాల్ల జీవితంలో ఒక భాగం.. వారికి వీటివలన శారీరక వ్యాయామంతోపాటు సూర్యకిరణాల వలన తగినంత విటమిన్ డి లభ్యమయ్యేది. ప్రస్తుత పరిశోధనలు చెప్తున్న దాని ప్రకారం విటమిన్ 'డి' తగినంతగా ఉంటే 'కరోనా' వలన సంభవించే ముప్పు కూడా తక్కువగా ఉంటుంది.

ఆ కాలంలో ఒక దినంలో ఎన్నో వేల అడుగులు అవలీలగా నడిచేవారు, కానీ ఇప్పుడు మనం చేతికి ఆధునిక స్మార్ట్ వాచీలు పెట్టుకుని పది వేల అడుగులు నడిచామ అని పండుగ చేసుకుంటున్నాం. పూర్వకాలంలో ఊబకాయం అనేది దాదాపు లేనే లేదు. మధుమేహపు ఛాయలు లేవు, అధిక రక్తపోటు అంటే తెలియదు, ఎన్నో ఆధునిక వ్యాధులు లేవు. ఎవరైతే శారీరకమైన శ్రమ చేయరో వారికి వ్యాయామం అవసరం నడక, తోట పనులు, ఇంటి పనులు, బట్టలు ఉతకడం మొదలైన ఎన్నో పనులు మనకు సహజమైన వ్యాయామం లాంటివే. ఇప్పటి పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి రోజులో కనీసం 3 నుండి 4 కిమీ ప్రతి రోజు నడవాలి. యోగాసనాలు లేదా వ్యాయామం 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు చేయాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కల్గుతుంది, ముఖ్యంగా రోగాలు దారికి రావు.

English summary
Food Habits and health formulas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X