Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ఎఫెక్ట్..! రేట్లు పెంచేసిన బుడ్డోడు..!
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో కేవలం కోటి రూపాయలు తీసుకుని అడుగుపెట్టిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) టోర్నీ ముగిసే నాటికి దానికి 30 రెట్లు ఎక్కువ టాలెంట్ చూపించేశాడు. దీంతో ఇప్పుడు అతని బ్రాండ్ వ్యాల్యూ కూడా మార్కెట్లో అమాంతం పెరిగిపోయింది. ఈసారి ఐపీఎల్ 2027లో వైభవ్ కోసం టాప్ టీమ్స్ పోటీ పడటం ఖాయంగా కనిపిస్తుండగా.. మార్కెట్లో ప్రకటనల రేట్లను కూడా అతను భారీగా పెంచేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 776 పరుగులు, 237.30 స్ట్రైక్ రేట్‌తో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా, సీజన్ అత్యంత విలువైన ఆటగాడి టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ఈ మెరుపు ప్రదర్శనతో అతని బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు రెట్టింపు అయ్యాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. వైభవ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు ప్రస్తుతం ఒక్కో డీల్‌కు రూ. 1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పెరిగాయి. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు, వైభవ్ ఒక్కో ఒప్పందానికి సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం అతని ఫీజులు గణనీయంగా పెరగడం అతని బ్రాండ్ విలువకు నిదర్శనంగా కనిపిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్‌తో ప్రస్తుతం రూ. 1.10 కోట్ల వార్షిక ఒప్పందం చేసుకున్న సూర్యవంశీ, ఐపీఎల్ వేలంలోకి వస్తే రూ. 30 కోట్ల బిడ్ లభించే అవకాశం ఉంది. అతని ఐపీఎల్ జీతం మారడానికి మరో సంవత్సరం పట్టనుంది. ఆలోపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సంపాదన మాత్రం భారీగా పెరిగింది. వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ అగ్రిమెంట్‌ల నిర్వహణను అతని తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. ఈ విషయంలో అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా వారికి మద్దతు ఇస్తోంది. కంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్‌లకు ఇప్పటికే ప్రచారం చేస్తున్న వైభవ్‌ను ఒప్పందం చేసుకోవడానికి ఇప్పుడు అనేక ఇతర బ్రాండ్లు పోటీపడుతున్నాయి.












Click it and Unblock the Notifications