ఐఆర్‌సీటీసీ యమునా పుష్కరాల ప్రత్యేక ప్యాకేజీ.. ఏపీ, తెలంగాణా మీదుగా.. డోంట్ మిస్!

యమునా నది పుష్కరాల సందర్భంగా, ఐఆర్‌సీటీసీ 'అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్' ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా పదిరోజుల ఈ యాత్ర జూన్ 3న ప్రారంభమవుతుంది. ప్రయాణికులు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్‌లలో ప్రయాణం చేయవచ్చు. ఈ ట్రిప్‌లో పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ వంటి ఆరు ప్రముఖ క్షేత్రాలు సందర్శిస్తారు.

ఈ స్టేషన్ల ద్వారా అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర

కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్ల కోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం లాంటి స్టేషన్‌ల నుండి రైలు ఎక్కవచ్చు. ప్యాకేజీలో అన్ని పన్నులు కలిపి ఉంటాయి: ఎకానమీ స్లీపర్‌కు పెద్దలకు రూ. 16,700, 5నుంచి 11సంవత్సరాల పిల్లలకు రూ.15,600. స్టాండర్డ్ 3 ఏసీకి పెద్దలకు రూ.26,100, పిల్లలకు రూ.24,800. కంఫర్ట్ 2 ఏసీకి పెద్దలకు రూ.34,100, పిల్లలకు రూ.32,500 ఛార్జ్ చేస్తారు.

IRCTC Yamuna Pushkaralu Tour Package Bharat gaurav tourist train ayodhya kashi baidyanath dham

ఈ యాత్రలో చూసే పుణ్య క్షేత్రాలు ఇవే

అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్రలో పూరీలో జగన్నాథ్ ఆలయం, కోణార్క్‌లో సూర్య దేవాలయం, బైద్యనాథ్ ధామ్‌లో బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం దర్శనమిస్తాయి. వారణాసిలో కాశీ విశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలతో పాటు గంగా హారతిని చూడవచ్చు .అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్‌గరి, ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం (యమునా పుష్కరాలు) సందర్శిస్తారు.

రోజువారీ షెడ్యూల్ ఇలా

మొదటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణించి రెండో రోజు పూరీలో జగన్నాథ దర్శనం ఉంటుంది. మూడో రోజు కోణార్క్ సూర్యదేవాలయం, నాలుగో రోజు బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం. ఐదో రోజు బనారస్ చేరుకుని రాత్రి బస చేస్తారు. ఆరో రోజు కాశీ విశ్వనాథుడిని దర్శించి, సాయంత్రం గంగా హారతి చూసి అక్కడే రాత్రి బస ఉంటుంది.

ఏపీలో హోటళ్లు, ఆహార తయారీ సంస్థలపై చంద్రబాబు సర్కార్ కీలకనిర్ణయం!
ఏపీలో హోటళ్లు, ఆహార తయారీ సంస్థలపై చంద్రబాబు సర్కార్ కీలకనిర్ణయం!

ఐఆర్‌సీటీసీ అందించే అద్భుతమైన ప్యాకేజ్

ఏడో రోజు అయోధ్యలోని రామ జన్మభూమిని, ఎనిమిదో రోజు యమునా నదిలో పవిత్ర పుష్కర స్నానం చేసి సాయంత్రం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తొమ్మిదో రోజు అర్ధరాత్రి లోగా గుడివాడ, పదో రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుని యాత్ర ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ అందించే అద్భుతమైన ప్యాకేజ్ కోసం మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ (9701360701), విజయవాడ (9281030714) కార్యాలయాలతో పాటు తిరుపతి, విశాఖపట్నంలోని కార్యాలయాల్లో సంప్రదించగలరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+