• search

దీర్ఘాయుష్మాన్ భవ: రుగ్వేదం ఉపవేదమే ఆయుర్వేదం

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అనేది వేద పురుష ఆశీర్వచనం.మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం.

  అలాగే నిత్యం చేసుకొనే సంధ్య వందన సూర్యోపస్థానంలో పశ్యేమ శరదశ్శతం,జీవేమ శరదశ్శతం,నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం అని చెప్పబడించి.నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి.నిండా నూరేళ్ళు జీవించాలి.ఆది కూడ ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది.

  గుడ్ మార్నింగ్ అని చెప్పడం, గుడ్ నైట్ చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం.మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు,శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది దాని వలన మేలూ జరుగుతుంది.

  What is deerga Ayushman Bhava

  ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది.

  అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి?అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం.నిజమే ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న దీర్ఘాయుష్మాన్ భవ 

  అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా?
  ఆని సందేహం ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ
  పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః

  అని చెప్పబడింది

  అంటే "ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయని" దాని అర్థం.

  ఆయుర్దాయం,

  మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా
  ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న

  లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని,
  జరిగి తీరుతుందని మరికొందరి మాట.

  ఏది నిజం మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది.

  ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది.

  అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.

  లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు

  దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం.

  What is deerga Ayushman Bhava

  అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం.
  ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం.

  కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన

  ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది.

  కాబట్టే మన పూర్వజులు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
  అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని,

  శతమానం భవతి అంటూ మహనీయుల ఆశీస్సులు
  పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది.

  భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యాప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్‌ భవ అనీ ఇలా సందర్భానికి తగినట్లు ఉంటాయి ఆ దీవెనలు.

  యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో పండితులు సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా? అంటే ఫలిస్తాయి. సత్పథంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి.
  ఈ ఆశీర్వచనాల వల్ల జాతక దోషాలు, మృత్యుగండాలు తొలుగుతాయి. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవడంలో తప్పు లేదు.

  అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు వారి విద్వత్తుకు,వారిలోని సరస్వతికి. మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన తలిదండ్రులు అతడికి పెద్దలు ఎవరు ఎదురైనా వారికి పాదనమస్కారం చేయమని చెప్పారు. మార్కండేయుడు అలాగే చేసి, దీర్ఘాయుష్మాన్‌ భవ అనే ఆశీర్వాద బలంతోనే చిరంజీవి అయ్యాడు.
  అందుకే అలాంటి ఆశీర్వచనాల కోసం పెద్దల యందు వినయ విధేయతలతో ఉండాలి.లోకా సమస్తా సుఖినో భవంతు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ayurvedam is sub vedam of Rigveda. What is deerga Ayushman Bhava.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more