ఏది శుభప్రదమైనది, లక్ష్మీపదమైనది?

Posted By:
Subscribe to Oneindia Telugu

దిక్కులలో తూర్పు దిక్కు శుభప్రదమైనది. పురాణాలలో శ్రీభాగవతం గొప్పది. సముద్రాలలో పాలసముద్రం గొప్పది. నదులలో గంగానది గొప్పది. ఆశ్రమాలలో గొప్పది గృహస్థాశ్రమము. కటాక్షాలలో కమలనివాసి శ్రీలక్ష్మీ కటాక్షము గొప్పది.
శ్రీమహాలక్ష్మిదేవిలో శ్రీ అంటే శోభ కలిగినది. ఇంకా కాంతిని గలిగినది. సకల విద్యలనూ ప్రసాదించేది. "లక్ష్మి అంటే సంపదలను ఇచ్చునదీ అని అర్థం. సంపదే సుఖాలకీ, కీర్తికీ మూలము.

మహా సామ్రాజ్యాన్ని ఏలిన ధృతరాష్ట్రుడు పాండవులు పెట్టిన ధర్మపిండం తినాల్సి వచ్చింది. తన పుత్రులైన కౌరవుల శ్రాద్ధకర్మలకు కూడా ధృతరాష్ట్రుడు చేయి చాపి విదురుడి చేత చెప్పించి పాండవుల వద్ద ధనాన్ని అడుక్కోవాల్సి వచ్చింది. ద్రోణాచార్యుడంతటి వాడు తన బిడ్డ అశ్వత్థామ ఆకలి కోసం ఓ పాడి ఆవునన్నా ఇమ్మని పాంచాలరాజు వద్దకెళ్ళి అభ్యర్థించి భంగపడ్డాడు.

What is good, what is not?

గర్భవతయిన భార్య పురిటి కోసం మౌని అనే ముని ఆ దేశరాజు వద్దకెళ్ళి ధనం అభ్యర్థించి పరాభవానికి గురికావలసి వచ్చింది.

ధనం అంత గొప్పది. ఉన్నప్పడు తెలీదు. లేనప్పుడే అసలు సిసలు స్వరూపం తెలుస్తుంది. నరకలోకంలో శిక్షల కన్నా పెద్దదీ, భయంకరమైనదీ దరిద్రము. అంతకుమించిన నరకం లేదు. ఉంటే అంతకుమించిన స్వర్గం లేదు. కాన ధనాన్ని సంపాదించాలి. నిలువ ఉంచుకోవాలి. శ్రీ లక్ష్మీనిధి = అలాంటి మహాధనంతోనే కార్తవీర్యుడు యజ్ఞాలూ, దానాలూ చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu astrologer described what i good and what is not. you can find out reading this article.
Please Wait while comments are loading...