వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోమాలు అంటే ఏంటీ..? వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటీ..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు ఏమిటో గమనిద్దాం.

గణపతి హోమం :- విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్య సిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్ట ద్రవ్యలు/ 8 రకాలు. దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది.

what is homas

రుద్ర హోమం:-పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్ర హోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం జరపబడుతుంది. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది.

చండీ హోమం:- హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరిసంపదల కోసం చండి హోమం నిర్వహించడం జరుగుతుంది. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.

గరుడ హోమం:- మానవుని శరీరాకృతి, గరుడుని ముఖము కలిగి... శ్రీమహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలిచుకొనే గరుడుడికి చేసే హోమమే గరుడ హోమం. సరైన విధివిధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం అలాగే అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం, అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం మొదలగునవి లభిస్తాయి. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపకశక్తి వృద్ధి జరుగుతుంది.

సుదర్శన హోమం:- శ్రీమహావిష్ణుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం.హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింపబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమం చేయడం జరుగుతుంది.

మన్యుసూక్త హోమం:- వేదాల ననుసరించి మాన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థం లో తీవ్రమైన భావావేశము అని చెప్పబడుతుంది.మాన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యుసూక్త పాశుపత హోమం. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం కూడా ఈ హోమాన్ని చేస్తారు. ఈ హోమాన్ని శనివారం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది.

లక్ష్మీ కుబేర పాశుపతహోమం:- హిందూ ధర్మానుసారంగా... సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరున్ని పూజిస్తాము.జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం సూచింపబడేదే లక్ష్మి కుబేర పాశుపతహోమం.జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీ వా పరిగణిస్తాము కనుక. హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి నిర్ణయించబడిన ముహూర్తానికి ఈ హోమం చేయబడును. ఈ హోమం చేయడానికి కమలాలని వాడడం జరుగుతుంది.

మృత్యుంజయ పాశుపత హోమం:- మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం.పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహిస్తారు. ప్రాణ హాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు.ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావాల్సిన ప్రధాన వస్తువులు. దర్భ, అమృత మూలిక. దీర్ఘాయుష్షును కోరుతూ హోమము చేసే వారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు.

నవదుర్గ పాశుపత హోమం:- భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింప బడుతుంది. జట దుర్గ, శాంతి దుర్గ, శూలిని దుర్గ,శబరి దుర్గ,లవణ దుర్గ,అసురి దుర్గ, దీప దుర్గా, వన దుర్గ, మరియు జ్వాలా దుర్గ. దుర్గామాతయొక్క ఈ తొమ్మిది రూపాలను పూజించడానికి చేసే హోమమే ఈ నవదుర్గ పాశుపత హోమం.ఈ హోమం చేయడం వలన దుష్ట శక్తుల నుంచి విముక్తి, శాంతి,సంపద, ఆరోగ్యం, ఆయుష్యు, సంతానం, విద్య మొదలైనవి లభించి ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన అంశాలను నుండి విముక్తి కలిగుతుంది.

English summary
Ganapati is the Vigyanaya who removes the Vigans. Ganapati is worshiped first of all the activities initiated by humans. Lord Ganesha is worshiped in order to complete the task that was started without any interruptions. Ganapathi Homam to Ganesha is performed to eliminate the difficulties and negative aspects of life. This Ganapati homecoming will bring success, health and prosperity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X