• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నవగ్రహ దోషం అంటే ఏంటీ ? పరిహారం కోసం ఏం చేయాలి ?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విముక్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివారు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగుగ్రహం తెలుసుకొని ఆ గ్రహానికి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.

what is Navagraha Mudras

సూర్యుడు: ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ లేదా గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థములు దానం చేయుట. తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

చంద్రుడు: చంద్రుడు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లేకపోవుట, భయం, అనుమానం, విద్యలో అభివృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట, స్త్రీలతో విరోధము, మానసిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపోవుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కువగా ఉండుట, స్త్రీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అనుగ్రహం కొరకు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పాలు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం, శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట మొదలగు వాటి ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు.

కుజుడు: జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేకపోవుట, అన్న దమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట, ఋణభాద తల ఒత్తిడి, రక్తానికి సంబంధించిన వ్యాధులు, శృంగారం నందు ఆసక్తి లేక పోవడం,కండరాల బలహీనత,రక్తహీనత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తించి కుజ గ్రహాను గ్రహం కొరకు సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనేయ స్వామి వారిని పూజిం చాలి.అలాగే హనుమాన్‌ చాలీసా పారాయణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్నదమ్ములకు సహాయం చేయడం, వారి మాటలకు విలువ ఇవ్వడం, స్త్రీలు ఎర్రని కుంకుమ,ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.

బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీనంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం,ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం,తరుచూ ధననష్టం మొదలగునవి జరుగుచున్నప్పుడు బుధగ్రహ దోషంగా గుర్తించి బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంకటేశ్వరస్వామి వారిని విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట,పెసలు దానం చేయుట, విద్యార్థులకు పుస్తకాలను దానం చేయట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.

గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, ని యంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

శుక్రుడు: జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్త్రీలకు అనారోగ్యము కలుగుట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భ ర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనముల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్త్రీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చే యుట, వివాహం కాని స్త్రీలకు వారి వివా హం కొరకు సహకరించుట, స్త్రీలను గౌరవించుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రా క్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.

శని: ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధకము, అతినిద్ర దీర్థకాలిక వ్యాధులు, సరయిన ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరోధములు, ఇతరుల ఆధీనములో పని చేయుట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌరవం లేకపోవుట, పాడుపడిన గృహముల యందు జీవించుట, ఇతరుల ఇంట్లో జీవనము సాగించుట, భార్య పిల్లలు అవమానించుట, కుటుంబమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరైన భోజనం కూడా లేకపోవుట మొదలగు కష్టములు కలుగును. శని గ్రహ అనుగ్ర హమునకు శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట.

శనివారము నియమముగా ఉండుట, ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట, హనుమాన్‌ చాలీసా పారాయణం చేయుట, హనుమాన్ కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది. స్వామి అయ్యప్ప మాల ధారణ చేయుట, శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట, దుప్పటి వస్తువులు దానం చేయుట, నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.

రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీనముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుట, నీచస్తులతో సహవాసము, కుష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవించుట, విద్యార్థులు విద్య మధ్యలో మానివేయుట, పాడుపడిన గృహములలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కు లు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవుట, మొదలగునవి సంభవించునప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి దోష నివార ణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట, దే వి భాగవతం పారాయణం చేయుట, గోమేధికం గాని ఎనిమిది ముఖములు గల రుద్రాక్షను గాని ధరించవలెను.భవాని మాల ధరించుట, స్త్రీలను గౌరవించుట వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును.దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది.

కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తన లో తానే ఊహించుకొనుట, తనని తాను దేవు డు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పోవుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచి త్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నా డు. కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయుట. దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట.అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట. వైఢూర్య ము గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు.

ప్రతిరోజు సూర్య నమస్కారం చేసు కొని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్నను పరిహారం జరుగును.

"ఆకృష్ణేన'' అను మంత్రముతో సూర్యుని, "ఇమం దేవా' అను మంత్రముతో చంద్రుని, ""అగ్నిర్మూర్ధా'' అను మంత్రముతో కుజుని, ""ఉద్బుధ్యస్వ'' అను మంత్రముచే బుధుని, ""యదర్య'' అను మంత్రముచే గురువును, ""అన్నాత్పరిస్రుతః'' అను మంత్రముచే శుక్రుని, ""శం నో దేవీ'' అను మంత్రముచే శనిని, ""కాండాత్‌'' అను మంత్రముచే రాహువును, ""కేతుం కృణ్వన్న కేతవ'' అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును.

జల్లేడు. మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్తు కాని హోమమును చేయవలయును. అట్లే తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కాని హోమము చేయవలయును.

ఋగ్వేద యజుర్వేదముల యందలి నవగ్రహ మంత్రములు:

1. సూర్య మంత్రము:

ఓం ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశ యన్న మృతం మర్త్యంచ l

హిరణ్యేన సవితా రథేనాఽఽ దేవోయాతి భువనాని పశ్యన్ ll

(ఋగ్వేదము 1-35..2 యజుర్వేదము 33-43 )

ఓం భూర్భువః స్వః సూర్య ఇహాగచ్ఛ ఇహ సః సూర్యాయ నమః

బీజ మంత్రము :-ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః

జపకాలము: ఉదయము

2. చంద్ర మంత్రము:

ఓం హందేవా అసపత్నం సువధ్వం మహతే క్షత్రాయ మహతే జ్యేష్టాయ మహతే జ్ఞాన రాజ్యాయేంద్ర స్యేంద్రియాయ l ఇమమముశ్య పుత్రమముష్యే పుత్ర మస్యై విశాఽ ఎషవోఽ మీరాజా సోమోఽ స్మాకం బ్రాహ్మణానాం రాజా ll

( యజుర్వేదము 9-40 )

ఓం భూర్భువః స్వః చంద్ర ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ సోమాయ నమః ll

బీజ మంత్రము :-ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః

జప కాలము: సంధ్యా కాలము

3. మంగళ మంత్రము:

ఓం అగ్ని ర్మూర్దా దివః కకుత్పతి: పృథివ్యా అయం l

అపాంరే తాంసి జిన్వతి ll

( యజుర్వేదము 8-44-16; యజుర్వేదము 13-14)

ఓం భూర్భువః స్వః భౌమా ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ భౌమాయ నమః

బీజ మంత్రము :-ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః

జపకాలము: రెండు గంటల సమయము

4. బుధ మంత్రము:

ఓం ఉద్బుద్య స్వాగ్నే ప్రతిజాగృ హిత్వమిష్టా పూర్తేం

సంసృజేదామయంచ అస్మిస్సదస్థే అధ్యుత్తరస్మిన్

విశ్వేదేవా యజమానశ్చ సీదత ll

( యజుర్వేదము 15-54 )

ఓం భూర్భువః స్వః బుధ ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ బుధాయ నమః

బీజ మంత్రము :-ఓం బ్రాం బ్రీం భ్రౌంసః బుధాయ నమః

జపకాలము: ఐదు గంటల సమయము.

5. గురు మంత్రము:

ఓం బృహస్పతే అతియదయోం ఘ్రుమద్ విభాతి క్రతుమజ్జనేషు l

యద్దీదయచ్చ వనఋతుప్రజాత తదస్మాసు ద్రవిణం దేహిచిత్రం ll

( ఋగ్వేదము 2-23-25 ; యజుర్వేదము 26-3 )

ఓం భూర్భువఃస్వః బృహస్పతే ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ బృహస్పతయే నమః

బీజ మంత్రము :-ఓం గ్రా౦ గ్రీం గ్రౌం సః గురవే నమః

జపకాలము: సంధ్యా కాలము

6. శుక్ర మంత్రం :

ఓం అన్నాత్పరిశృతోరసం బ్రహ్మణాన్యపిబత్ క్షం పయః సోమం ప్రజాపతిః l

ఋతేన సత్య మింద్రియం విపానాం శుక్ర మందస ఇంద్ర స్యేంద్రియ మిదం పయో మృతం మధు l l

(యజుర్వేదం 19-65)

బీజమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః

జప కాలము : సూర్యోదయ సమయం

7. శని మంత్రము :

ఓం శంనో దేవీరభిష్టయ ఆపోవబంతు పీతయే l

శంయోరభిస్ర వంతునః ll

( ఋగ్వేదము 10-9-4 ; యజుర్వేదము 36-12 )

ఓం భూర్భువఃస్వః శనై శ్చరః ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ శనైశ్చరాయ నమః

బీజ మంత్రము :-ఓం ప్రాం ప్రీం ప్రౌంసః శనైశ్చరాయ నమః

జపకాలము: సంధ్యా కాలము

8. రాహు మంత్రం :

ఓం కయానాశ్చిత్ర ఆభువధూతీ సదావృధాఃసఖా l కాయాశాశ్చిష్ఠయావృతా l l

(ఋగ్వేదం 4-31-1, యజుర్వేదం 26-39)

ఓం భూర్భువః స్వః రాహో ఇహాగచ్ఛ ఇహతిష్ఠ l రాహవేనమః

బీజమంత్రం:- ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః

జప కాలం :- రాత్రి సమయం

9. కేతు మంత్రం:

ఓం కేతుం కృణ్వన్న కేతవేపేశే మర్యా అపేశసే l సముపద్భి రాజాయధాః l l

(ఋగ్వేదము 1-6-3; యజుర్వేదము 29-37)

బీజమంత్రం :- ఓం స్త్రాం స్త్రీం సౌం సః l కేతవేనమః

జపకాలం :- రాత్రి సమయం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There are many problems in human life's everyday life. Those who believe in astrology get a gray idol that is worshiped to the planet as soon as the cause of the problem becomes relieved from the worst problem. Even those who do not have astrological knowledge will be able to grasp the hardships caused by them and get rid of the planetary disturbance of the planet's paths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more