ఆ స్కూళ్లు, పరిశ్రమలపై పవన్ కొరడా..! సంచలన ఆదేశాలు..!
ఏపీలో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ గ్రామ పంచాయతీల్లో మాత్రం పన్ను ఎగవేతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పంచాయతీల్లో ఆదాయాల పెంపుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పంచాయతీల్లోని విద్య సంస్థలు, పరిశ్రమలు ఎక్కువగా పన్నులు ఎగవేస్తున్నట్లు గుర్తించిన పవన్.. వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు.
రాష్ట్రంలోని పలు పంచాయతీల్లో ప్రైవేటు విద్యా సంస్ధలు, పరిశ్రమలు నడుపుతున్న వారు కోట్లాది రూపాయలు ఆదాయాలు సంపాదించుకుంట.. ప్రభుత్వానికి మాత్రం పన్నులు కట్టకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం ఓవైపు ఆదాయం లేక ఇబ్బందులు పడుతోందని, ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్దితుల్లో ఆదాయం చాలా కీలకంగా మారిందన్నారు.

విద్యా సంస్ధలకు పంచాయతీ చట్టం ప్రకారం పన్నులు కట్టకుండా ఎలాంటి మినహాయింపులు లేవని, ఇతర వర్గాలకు మాత్రం కొన్ని మినహాయింపులు ఉన్నట్లు అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. తానే ఖాళీ స్దలానికి 15 లక్షలు చెల్లించానని పవన్ వారికి గుర్తుచేశారు. కాబట్టి పంచాయతీల పరిధిలో పన్నుల్ని తిరిగి అసెస్మెంట్ చేయాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు. ఓ మండల పరిధిలో ఉన్న పంచాయతీలు ఎన్ని, వాటికి రోడ్లు వేయడానికి, చెత్త సేకరణ, మంచి నీటికి ఎంత ఖర్చుపెడుతున్నాం, వాటి నుంచి ఎంత ఆదాయం వస్తుందన్న అంశాన్ని సమీక్షించాలని ఆదేశించారు. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వారినీ పన్ను చెల్లించకపోయినా వదిలేయడం సరికాదన్నారు. అందులో కూటమి నాయకులు ఉన్నా వదిలిపెట్టొద్దని పవన్ సూచించారు.












Click it and Unblock the Notifications