వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆటంకాలు: శాల్య దోష పరిహారము

శల్యాలంటే అనేక స్వరూపాలలో వుండవచ్చు. అవిలోహ శకలాలుగా గాని, కట్టెలు, ఊక, బొగ్గులు, ఇటుకలు, ఎముకలు మొదలగు వాటిని కూడా శల్యాలని వ్యవహరిస్తారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్లో| "శల్యానేకవిధాః ప్రోక్రాధాతు కష్టాస్థి సంభవాః" (విశ్వకర్మ ప్రకాశిక)

శల్యాలంటే అనేక స్వరూపాలలో వుండవచ్చు. అవిలోహ శకలాలుగా గాని, కట్టెలు, ఊక, బొగ్గులు, ఇటుకలు, ఎముకలు మొదలగు వాటిని కూడా శల్యాలని వ్యవహరిస్తారు.

శ్లో| పురుషా ధః స్థితం శల్యం గృహే దోషదం భవేత్" (అగ్ని పురాణం)

తా! శల్య పరిశీలన కోసం ఆ ప్రాంతాన్ని త్రవ్వతున్నపుడు పురుషప్రమాణము లోతులో గనుక శల్యాలుంటే, ఆ నిర్మాణానికి దోషాన్ని కలిగిస్తాయి. పురుష ప్రమాణముకన్నా మించిన లోతులో శల్యాలున్నా అవి నిర్మాణాలకు గాని, ఆ స్థలయజమానిపై కాని ఎలాంటి దుప్రభావాలనూ కలిగించలేవు.

పురుష ప్రమాణమంటే :

"పాంచాశల్నిర్ధన వితస్తి ర్వింశతి కరాంగుళః పురుషః (సులభసూత్రం)

తా| 120 అంగుళాలు అనగా 8 గజముల ఒక అంగుళ ప్రమాణమని తెలియుచున్నవి.

ప్రశ్నే పుచ్చాప్యచ్చారితే యత్ర న్యూన వర్గస్య పంచమే 1
న విద్యతే తత్ర శల్యం బ్రహ్మోక్తత్వాన్న సంశయః II (జ్యోతిస్సంహితార్ణవ)

నిర్మాణం చేయుచున్న యజమాని వాస్తు సిద్ధాంతిని అడిగే ప్రశ్నలో మొదటి అక్షరం, జ తో గానీ, ఇ* తో గానీ, ణ, న, మ, య లతో గానీ మొదలైతే ఆ చోట శల్యములు లేనట్టే ఈ ప్రకరణము బ్రహ్మదేవునిచే చెప్పబడినందున సంశయానికీ, సందేహానికీ తావుండదు.

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల వారు దుకాణం కట్టిన తర్వాత భూమిలో వున్న శల్యములు తీయడం కష్టమని పునాదులు తీయకముందే భూమిని పురుషప్రమాణం లోతుగా . తవ్వి శల్యములను తొలగించి నిర్మించుకుంటున్నారు. పురుష ప్రమాణంలో భూమిని దున్నడం కుదరనప్పడు ఆ భూమి యందు తులసి చెట్లు, నువ్వుల చెట్లు వేసినచో అందుండు శల దోషములు తొలగునని శాస్త్రము చెబుతున్నది.

గృహారంథే చ కండూతి: స్వాంగేయత్ర ప్రవర్తతే ప్రసాదే భవనేతధా ! (విశ్వకర్మ ప్రకాశిక)

తాI నిర్మాణం ప్రారంభించే సమయంలో ఆ స్థల యజమానికి ఏ అవయవమున !

Astrologer explains Shalya dosha pariharam.

దురద కల్లనో వాసు పురుషుని ఆ అవయవమున శల్యాలున్నాయని నిశ్చయించుకోవాలి. పాత దుకాణములోని శల్యములను కనుక్కొనే పద్ధతులు కొన్ని:

శ్లో త్రయాణాం వత్సరాణాం చేజ్ఞన్తో మృత్యుః స్థితో గృహే |

తస్మిన్ ప్రాచ్యే శల్యమమస్తి నరస్యేతి వినిశ్చయేత్ II (ప్రాచీనకారిక)

| దుకాణములో వుండు వారికి గానీ, దుకాణ యజమాని యింటినందుగానీ తరచుగా మరణములు సంభవించుచుండిన ఆ నిర్మాణము యొక్క తూర్పు భాగమున మనిషి ఎముకలుంటాయని శాస్త్రం రూఢిగా చెబుతోంది.

శ్లో గృహే సదా చ సర్వేషాం కలహో వర్థతే యది |గృహ మధ్యే శిర శల్యం వర్తతే ధృవం

తాI షాపులో పనిచేస్తున్న వారికీ, యజమానికీ లేదా, ఆ షాపు యజమానికీ, అతని కుటుంబ సభ్యులకూ తరచు మనస్పర్థలు, పరస్పర కలహాలతో వాతావరణం అశాంతిమయంగా ఉంటే ఆ నిర్మాణపు తూర్పు భాగంలో తలపుర్రె గానీ, తల ఎముకగానీ నిశ్చయంగా ఉంటుంది.

శ్లో రోగప్రాప్తి పాదశల్యం - గమనం జాను శల్యకం ! .
ఊరు శల్యం ఋణంచైవ - కష్టం స్వాత్కృష్ణ శల్యకం II
విద్వేషం జఘనం శల్యం -. నాశం గుహ్య శల్యకం !
బంధనం బాహుశల్యేన శిరోస్థి మరణం ధృవం

పాదభాగము నందలి ఎముకలుండినచో రోగములు ప్రాప్తిస్తాయి. మోకాళ్ళ ఎముకల వలన వృధాప్రయాస, ప్రయాణాలు, తిరుగుట, త్రిప్పట కలుగుతాయి. తొడ ఎముకలుండుటచే బుణబాధలు కలుగుతాయి. యోని, మర్మ స్థాన ఎముకలవలన నాశనం కల్లుతుంది. శిరస్సు నందలి ఎముకలుంటే తప్పక మరణాలు సంభవిస్తాయి.

అలాగే ఆ దుకాణమునందు చేయు వ్యాపారములు అధిక నష్టాలు కష్టాలు, కోర్టు గొడవలు, భయాందోళనలు ఎక్కువగా సంభవిస్తున్నప్పడు తక్షణం శల్య పరీక్ష జరిపి తీరాల్సిందే. మన పూర్వీకులు అంటే ముత్తాతల కంటే ఎన్నో తరాల ముందువారు బంగారు !

కాసులు, నవరత్న రాసులు, కొన్ని విలువైన వజ్రవైఢూర్యాది రాళ్ళు, నగిషీ ఆభరణాలు రాగి బిందెలలోను, ఇత్తడి, వెండి బిందెలలోనూ భద్రపరచి భూమిలో నిక్షిప్తం చేసేవారు. / అనుభవించేవారు లేకనో, సంతానం పట్టకనో, దొంగల భయం, రాజుల యుద్ధభయం వలనో తదనంతరం తమ వారసులకు చెందాలనో, వారివారి కులదేవతలను కొలిచి, భూమిలో
దాచిపెట్టిన బంగారు బిందెలనే 'లంకెల బిందెలు" అనేవారు. నేలమాళిగలలో నిక్షిప్తమై ఉన్న ఈ లంకెల బిందెలు ఆకస్మిక అదృష్ట దేవతవలె, ఘల్లఘల్లుమనుచూ ఐశ్వర్య లక్ష్మి మనకు దరిచేరి ఉద్ధరిద్దామని మన నట్టింటికి నడచి వచ్చినా, మనం ఆ సిరులను అందుకోలేం, పొందలేం, తెలుసుకోలేం.

ఎందుకో తెలుసా ? ఆ ఇంటికి, ఆ కొట్లకు వాస్తు దోషం - శల్యవేధ రూపంలో అడ్డం తగులుతుంది. భూనిక్షిప్త ఆసులకు అస్తికలే అవరోధం. మనం వ్యాపారం చేయు షాపులు, నివాస ఇళ్ళు, ఇండస్టీలు, హోటల్స్, పనిచేయు సంస్థలు, ఆఫీసులలో ఎక్కడ మనం ఉంటున్నా ఆ క్రింది భూమిలో ఉండు శల్యముల) యొక్క అంగభాగములను బట్టి మనకు సంక్రమించు అవయోగములు, శల్యములే ఆర్ధిక, మానసిక, శారీరక వైకల్యములకు మూలకారణం. ఇది ప్రచారం అనుకుంటే అది మిూ గ్రహచారం. ఇది సదాచారమే అనుకుంటే అది మిరాకెంతో ఉపకరం,

శ్లో పశవో బహువశ్చాపి క్షీరహీనా భవంతి చేత్ | తత్ర్పాచ్యాం శిశుశల్యాని సంతీతి సతతం వదేత్ |

పాడిపశువులు పాలు యివ్వకుండిననూ, త్వరగా ఒట్టిపోతున్ననూ, తగినంత క్షరసు రాకుండిననూ ఆ "కొట్టాయం" పశుశాలయందు తూర్పు శిశుశల్యములున్నవని నిశ్చయింపవలెను.

English summary
Astrologer explains Shalya dosha pariharam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X