వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టుమ‌చ్చ‌లు - వాటి ఫ‌లితాలు: పుట్టు మచ్చల గురించి శాస్త్రం ఏం చెబుతోంది..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మాన‌వుడి జాత‌కాన్ని నిర్థేశించ‌డంలో పుట్టుమ‌చ్చ‌ల‌దీ ఓ పాత్ర అని చెప్ప‌వ‌చ్చు. వ్య‌క్తుల స్వరూప స్వభావాలను తెలుప‌డంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టు మచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా, అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి.

కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

What is the importance of moles according to Astrology,what results it gives?

మాన‌వ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది. తలపై కుడి భాగంలోనూ, నుదురు మధ్య భాగంలో, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది. ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై,. నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి.

ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా, కుడి భుజం పైన, పొట్ట పైన, హృదయ స్థానంలోను, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపై గల పుట్టు మచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి. ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గానీ, కాలం కలిసిరావడం వలన గాని ధనయోగం కలుగుతుందనేది స్పష్టమవుతోంది.

తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే.. రాజకీయాల్లో రాణిస్తూ.. ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవ‌కాశం ఉంటుంది. మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు. అణకువగల భార్య.. వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ వుంటుంది.

ఇక మాడుకు ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే గ‌న‌క‌.. మంచి తెలివితేటలతో పాటు వాక్ చాతూర్యం ఉంటుంది. సమాజ హితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. సంసారాన్ని.. సంతానాన్ని ప్రతి బంధకాలుగా భావించే వీరు వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్నే ధ్యేయంగా పెట్టుకుంటారు.

మాడు భాగానికి ముందు వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే.. ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా సరే తన మాట వినవలసిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. వీరికి సంపాదనే కాదు.. సంతానమూ ఎక్కువే.

ఇక మాడుకు వెనుక వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే.. పేరు ప్రతిష్ఠలకన్నా డబ్బు గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. భార్యపై ప్రేమానురాగాలే కాదు.. ఇతర వ్యామోహాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. సంపాదనకు కొదవ ఉండకపోవడంవల్ల వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వుంటారు.

ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి. దురుసుతనానికి.. నిదర్శనంగా వీరు కనిపిస్తారు.

పురుషుల ముఖంపై పుట్టుమచ్చలు:- స‌హ‌జంగా ఎవరి ముఖమైనా చూడగానే మొదట నొసలు కనబడతాయి. ఈ నొసలు సువిశాలంగా ఉన్న వ్యక్తిని మంచి ఆలోచనాపరుడిగా గుర్తించ‌వ‌చ్చు. అటువంటి నుదుటి భాగాన మచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచి వాడనిపించుకుంటాడు. పరోపకారి అవుతాడు.

అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది. సువాసన ద్రవ్యముల పట్ల ఆసక్తిని కలిగి ఉండి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై వుంటాడు. ఇక కుడి కనుబొమ మీద మచ్చ ఉంటే వివాహం తొంద‌ర‌గానే అవుతుంది. సుగుణశీలిగ‌ల‌ భార్య లభిస్తుంది. భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు. ఈ పురుషుడు శాంత స్వభావంను కలిగి ఉంటాడు. కుడి కంటి లోపల మచ్చ ఉండినట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు.

కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే.. వ్య‌క్తి సంపదలను కలిగి ఉంటాడు. మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగానే చెప్ప‌వ‌చ్చు.

పుట్టుమచ్చలు ఏ రంగులో.. వ్య‌క్తి స్వ‌భావాలు, జాత‌కం చెప్పాలంటే శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విష‌యం కూడా చాలా ముఖ్య‌మే. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగాను, ఆకుపచ్చగాను, తేనెరంగుగాను, పసుపుపచ్చగాను, గంధపు రంగుగా ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి.

అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచికములని పెద్దలు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి. అలాగే పుట్టు మచ్చల మీద వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అవి కొంచెము పొడవు కలిగి ఉంటేగ‌న‌క‌ ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి.

English summary
It can be said that birthmarks play a role in determining the human race. Moles play a major role in revealing the personality traits of individuals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X