వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీక మాసంలో ఏ పనికి ఏ ఫలితం?

|
Google Oneindia TeluguNews

మాసాల్లోకెల్లా శ్రేష్టమైన కార్తీక మాసామానికి లోకంలో సాటివచ్చేది ఏదీ లేదని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అటువంటి పుణ్య మాసంలో ఏ పనిచేస్తే ఏ ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం.

పద్మములతో విష్ణువును పూజించేవారి ఇంటిలో పద్మాల్లో నివసించే లక్ష్మీదేవి నిత్యనివాసం చేస్తుంది.
మారేడు దళాలు, తులసీ దళాలు, జాజిపువ్వులతో విష్ణువును పూజించేవారు తిరిగి భూమిపై జన్మించరు.
భక్తితో ఫలాలు దానమిచ్చేవారి పాపాలు నశిస్తాయి.
ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో విష్ణువును పూజించేవారిని చూడటానికి కూడా యముడు సరికాదు.
బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టుకింద సాలగ్రామాన్ని పూజించుకువారు వైకుంఠానికి వెళ్లి విష్ణువువలే ఆనందిస్తారు
స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి, చలితో వణుకువానికి వస్త్రదానము చేస్తే 10వేల అశ్వమేథ యాగములు చేసిన ఫలమును పొందుతారు.
కార్తీక మాసంలో తులసి, గంధంతో సాలగ్రామాన్ని పూజించేవారు పాప విముక్తులై విష్ణు లోకాన్ని పొందుతారు.

What is the result of any work in the kartika masam

విష్ణువు సన్నిధిలో స్త్రీకానీ, పురుషుడు కానీ నాట్యం చేస్తే పూర్వ జన్మ పాపాలన్నీ నశించును.
ఇతరులెవరైనా విష్ణు పూజ చేసుకోవడానికి మనో వాక్కాయలతో సహాయం చేసినవారు స్వర్గానికి వెళతారు.
కార్తీక మాసంలో విష్ణువు సన్నిధిలో జపం చేయనివాడు భూమి మీద 7 జన్మలు నక్కగా జన్మిస్తారు.
సాయంత్రం సమయంలో విష్ణువు సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసేవారు వైకుంఠానికి చేరుకుంటారు.
సాయంత్రం సమయంలో స్తోత్రాలను పఠిస్తే స్వర్గంలో కొన్నాళ్లుండి, ఆ తర్వాత ధ్రువలోకానికి చేరి సుఖిస్తారు.

English summary
Mythology reveals that there is nothing in the world that compares to the best month of Kartika.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X