స్టూడెంట్‌ బస్‌పాస్‌ల పై TGSRTC కీలక నిర్ణయం, ఇక నుంచి..!!

విద్యార్ధులకు జారీ చేసే బస్ పాస్ ల పైన ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలు వేసవి సెలవుల తరువాత ప్రారంభానికి సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు ఈ నెల 5 నుంచి బస్‌పాస్‏లు జారీ చేసేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. విద్యా సంస్థలకు బస్‌పాస్‌ కోడ్‌లు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే కోడ్‌ ఉన్న సంస్థలు పాస్‌లు దరఖాస్తు చేసుకోవ డంపై పలు సూచనలు చేసింది. దీంతో.. సులభంగా బస్ పాసులు పొందవచ్చని పేర్కొంది.

విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండటంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ సెంట్రల్‌ విద్యా సంస్థలకు బస్‌పాస్‌ కోడ్‌లు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే కోడ్‌ ఉన్న సంస్థలు పాస్‌లు దరఖాస్తు చేసుకోవ డంపై పలు సూచనలు చేసింది. శుక్రవారం నుంచి స్టూడెంట్‌ బస్‌పాస్‌లు జారీ చేయనున్నట్టు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.రాజశేఖర్‌ తెలిపారు. ఎప్పటిలాగానే విద్యార్థులకు జారీచేసే ఫ్రీ, రూట్‌, స్టూడెంట్‌ జనరల్‌, స్టూడెంట్‌ గ్రేటర్‌, స్టూడెంట్‌ స్పెషల్‌, స్టూడెంట్‌ ఎక్స్‌క్లూజివ్‌, డిస్ట్రిక్ట్‌ రూట్‌పాసులు పొందడానికి http: //tgsrtc pass.comలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చంద్రబాబు, విజయ్ ను అధిగమించిన డీకే శివకుమార్ - దేశంలోనే నెంబర్ ఒన్..!!
చంద్రబాబు, విజయ్ ను అధిగమించిన డీకే శివకుమార్ - దేశంలోనే నెంబర్ ఒన్..!!
tgsrtc-begins-online-student-bus-pass-applications-for-2026-27-passes-to-be-issued-from-june-5

ఆర్టీసీ కీలక సూచనలు

విద్యాసంస్థలు ఆర్టీసీ సూచించిన అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీలు చెల్లించాలని కోరారు. కాగా, ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీ లు చెల్లించడం నుంచి మినహాయించినట్టు వివరించారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలన్నీ ప్రస్తుతమున్న బస్‌పాస్‌ కోడ్‌ రెన్యూవల్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌ ద్వారా అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీలు చెల్లించి, అవసరమైన పత్రాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో సమ ర్పించాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు కూడా టీజీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పత్రాలు, ప్రొఫార్మా షీట్‌తో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాల టీజీఆర్టీసీపాస్‌ వెబ్‌సైట్‌, 80082 04216 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+