మహాలయం - అంటే ఏమిటి?: శ్రాద్ధము చేయకుంటే ప్రమాదమా?..

Subscribe to Oneindia Telugu

భాద్రపద బహుళ పాఢ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం. దీనినే పితృపక్షం అని కూడా అంటారు. కాలం చేసిన పెద్దవారిని తలుచుకుని వారి పేరిట పితృకర్మలు, దానధర్మాలు చేస్తుంటారు. మహాలయ పక్షం ప్రాశస్త్యం గురించి కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఓ సందర్భంలో ఇలా వివరించారు.

ప్రతి మానవుడు నాలుగు యజ్ఞాలు పాటించాల్సి ఉంటుంది. పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, దేవ యజ్ఞం, భూత యజ్ఞం. వైదిక ధర్మానుసారం వీటిని ఆచరించినపుడు మనుష్య జన్మకు సార్థకత చేకూరుతుంది. రోజుకు కనీసం ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. వేద పఠనం, శ్రవణం దేవయజ్ఞం.

అన్ని ప్రాణుల యందు ప్రేమ, దయ కలిగి ఉండటం భూత యజ్ఞం. పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడం, వారి పేరిట దానధర్మాలు చేయడం, తిలోదకాలు సమర్పించడం పితృయజ్ఞం.
'మాతృదేవోభవ, పితృదేవోభవ' అని వేదోక్తి. తల్లిదండ్రులు దైవసమానులు. వారు ఈ లోకమును వదిలి వెళ్లిన తర్వాత కూడా తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధకర్మలు చేయాలి.

 What is the significance of Mahalaya?

అయితే ''మనం సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్న పిండాలు, ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా..? చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా..? పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మళ్లీ జన్మించి ఉంటే, వారి కోసం ఇవన్నీ చేయడం పిచ్చి పని'' అని కొందరి వాదన.

''పట్టణంలో చదువుకుంటున్న కుమారుడికి డబ్బు పంపించడానికి ఓ మోతుబరి రైతు పోస్టాఫీసుకి వెళ్లాడు. అక్కడి గుమాస్తాకు డబ్బులిచ్చి మనియార్డర్‌ ద్వారా తన కొడుక్కు పంపాల్సిందిగా కోరాడు. కాసేపటికి ఆ గుమాస్తా 'మీ అబ్బాయికి డబ్బు పంపించాము.. రెండుమూడు రోజుల్లో అందుతుంద'ని చెప్పాడు. ఆ రైతుకు నమ్మకం కుదరలేదు. తానిచ్చిన పైకం ఇక్కడే ఉండగా.. డబ్బు తన అబ్బాయికి ఎలా అందుతుందో అర్థం కాలేదు. కానీ అతడి అబ్బాయికి డబ్బు చేరింది.

పితృదేవతలకు పిండప్రదానం చేయడమూ ఇలాంటిదే. శాస్త్ర ప్రకారం శ్రాద్ధం శ్రద్ధగా నిర్వర్తిస్తే ఆ ఫలం పితృదేవతలకు అందేలా దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుట్టినట్టయితే భోజనం గ్రాసం రూపంలో అందుతుంది. వారు ఏ లోకంలో ఉన్నా.. వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫలం అందుతుంది. పరాయి ఊళ్లో ఉన్న వ్యక్తికి డబ్బును చేరవేర్చే మార్గం లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు.. మరో లోకంలో ఉన్న పెద్దలకు శ్రాద్ధఫలం దక్కే మార్గం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదా..?

ప్రేమ, భక్తి, జ్ఞానం వంటి స్థితులకు నియమం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం. ఆ నియమాలు తెలిపేదే శాస్త్రం. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది.

శ్రాద్ధము చేయకుంటే ప్రమాదమా ?

భూతబాధ పితృదోషాలు, భూతబాధలు - రెండూ అదృశ్యమైనవే! పితృదేవత లను తృప్తిపరిస్తే పితృదోషం పోతుంది. కాని, భూతాలను ప్రసన్స్టం చేసుకోలేం. వీటితో ముక్తి పొందాలి. దీని కోసం ప్రయత్నాలు కూడా కష్టతరమైనవే! పితృదోషం అంటే- ఊర్ధ్యగతికి చెందిన లేదా అధోగతి పితృదేవతల శాపం అవుతుంది. భూతబాధ- ఒక మృతాత్మవిశేషమైన ప్రయోజనం కోసం ఇచ్చిన శాపం. భూత బాధలో శాపం ఒక్కటే కాదు, చాలాసార్లు భూతం-వ్యక్తి శరీరంపై కూడా అధికారం చలాయిస్తుంది.

పితృదోషం, భూతబాధ - రెండింటిలో కారణాలు వేర్వేరుగా ఉంటాయి. పితృదోషం వల్ల వచ్చే చెడు ఫలితాలను తెలుసుకోవడం కష్టం. వారు తమ కుటుంబీకులకు పెద్ద నష్టాలు చేయవచ్చు. వీరి శాపాల్లో ఆర్ధికబాధలు, కార్యక్షేత్రంలో సమస్యలు, కుటుంబసభ్యుల్లో అభిప్రాయభేదాలు వంటివి ఉంటాయి. ఈ సమస్యలతో పితృదోషాల ను గుర్తించలేం. భూతబాధ భిన్నంగా ఉంటుంది. ఎవరి శరీరంలోనూ ప్రవేశిం చారు. కాని, ఇంట్లో చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతాయి.

తలుపులు వాటంతటవే తెరుచుకొంటాయి. లేకపోతే వాటంతటవే మూసుకొంటాయి. గట్టమీద పెట్టిన వస్తువులు కింద పడిపోతాయి. పంపు తనంతట తాను తెరుచుకొని నీళ్లు పోతాయి. ఏదో భూతం ఇంట్లో ఉండి, మిమ్మల్ని అక్కడ నుండి తరిమేద్దామని చూస్తుంటే ఇలా జరుగుతాయి. అధోగతిలో ఉన్న పితృదేవతలు భూతాలై మీ ఇంట్లో ఉన్నా ఇటువంటి బాధలు పెట్టరు. కాని, ఉన్నారనే సంగతి మనకు మాటిమాటికి తెలియజేస్తుంటాయి.

మరీ ఎక్కువ కోపం వస్తే భూతాల మాదిరిగా సమస్యలు తెచ్చిపెడతాయి. కుటుంబీకుల మృతాత్మల శరీరంపై అధికారం చేయడం జరగదు పితృదోషం ఉంటే! జాగరణ చేస్తూంటే పితరులను ఆహ్వానిస్తారు. కొంత నిర్ణీతమైన సమయంలో వారి కుటుంబసభ్యుల శరీరం పైకి వస్తారు. మీరు ఎన్నో విధాలుగా మీ ఇంటిని, మిమ్మల్ని జాగ్రత్త పెట్టుకొంటారు.

అప్పుడు భూతబాధ మిమ్మల్ని బాధించదు. కాని, పితృదోషం జరగవచ్చు. మీ ద్వారా చేసిన ఉపాయాలు పితృదేవతలను మీ ఇంట్లో చేరకుండా అడ్డగించలేవు. ఒకవేళ అడ్డగించినా వారు దూరంగా ఉండి బాధపెట్టగలరు. ఈ బాధలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు. మీరు బలవంతంగా మీ కుటుంబంలో మృతులైనవారి ఆత్మలను వశం చేసుకోవాలని ప్రయత్నం చేసినా పితృదోషం పరిష్కారం కాదు. పితృదోషం నివారణ కావాలంటే వారిని సంతృప్తిపరచడం ఒకటే మార్గం.

భూతబాధతో ఒకసారి ముక్తి దొరికితే తరవాత బాధించవు. కాని, ఒకసారి పితృదోషంతో ముక్తి పొందిన తరవాతా శ్రాద్ధకర్మ చేయడానికి నిర్లక్ష్యం చేస్తే పితృదోషం మళ్లీ తయారవుతుంది. దీనివల్ల తెలుసుకోవలసినది ఏమిటంటే- పితృదోషం, భూతబాధ వేరర్వేరుగా ఉంటాయని. భూతబాధలు దురదృష్ట కారణంగా సంభవిస్తాయి. పితృదోషానికి మూలం స్వయంకృతాపరాధమే. దీనికి నివారణ క్రమం తప్పకుండా శ్రాద్ధకర్మ నిర్వర్తించడమే!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahalaya, which marks the beginning of Devi-Paksha and the end of the Pitri-Paksha (the Shradh or the mourning period) is an auspicious day

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X