హోటల్ స్టైల్ లో క్రిస్పీగా సూపర్ టేస్టీ పెసరట్టు..!
ఉదయాన్నే ఏదైనా టిఫిన్ తినందే చాలా మందికి డే స్టార్ట్ కాదు.. అయితే మార్నింగ్ టిఫిన్స్ లో ఇడ్లీ, దోశ మాదిరిగానే పెసరట్టుకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పెసరట్టు అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నోరూరుతుంది. క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ పెసరట్టును ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే చాలా మంది అమ్మలు ఇంట్లో పెసరట్టును తయారు చేస్తుంటారు. కానీ హోటల్ స్టైల్ లో క్రిస్పీగా, రుచికరంగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి ఈ పద్ధతిలో ఈజీగా సూపర్ టేస్టీ పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? అని పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
సూపర్ టేస్టీ పెసరట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పెసలు రెండు కప్పులు, బియ్యం రెండు టేబుల్ స్పూన్ లు, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, అల్లం ఒక ఇంచు ముక్క, కొత్తిమీర తగినంత, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె లేదా నెయ్యి కాల్చడానికి తగినంత, ఉల్లిపాయ ముక్కలు పైన వేయడానికి సరిపడా, అల్లం తురుము పైన వేయడానికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే..

ముందుగా పెసలు అలాగే బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. అలా 4 నుంచి 6 గంటల పాటు తగినంత నీరు పోసి నానబెట్టుకోవాలి. ఇక పెసలు నానిన తర్వాత బియ్యాన్ని వడకట్టి మిక్సీలో తీసుకోవాలి. ఆ తర్వాత దీనికి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు చేర్చాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తటి బ్యాటర్ గా రుబ్బుకోవాలి. బ్యాటర్ మరీ పలుచగా ఉండకూడదు. బ్యాటర్ సిద్ధంగా ఉంది. కావాలంటే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కలుపుకోవచ్చు. ఇప్పుడు నాన్ స్టిక్ పెనం వేడి చేయాలి. కొద్దిగా నూనె రాసి ఒక గరిటె పిండి పోసి పలుచగా రుద్దుకోవాలి. దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం తురుము చల్లుకోవాలి. ఆ తర్వాత చుట్టూ కొద్దిగా నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే వేడి వేడి సూపర్ టేస్టీ పెసరట్టు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications