• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mahalaya Amavasya:పితృ తర్పణము - విధానం..ఎలాంటి పుణ్యం దక్కుతుంది..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పితృదేవతల కోసం మహాలయ అమావాస్య రోజు తర్పణం విధిగా చేయాలి. ‌పితృ తర్పణము, మీకు మీరే ఎలా చేసుకోవచ్చో తెలుసుకోండి.

‌ఆచమ్య :- ‌ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా |

 What kind of pooja should one do on Mahalaya Amavasya day,Know here

‌ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః |ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీ కేశాయ నమః | ఓం పద్మ నాభయ నమః| ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |‌ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః| ఓం అనిరుద్దాయ నమః |ఓం పురుషోత్తమాయ నమ|| ఓం అధొక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః| ఓం జనార్దనాయనమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః ||

‌పవిత్రం దృత్వా || ( దర్భ పవిత్రమును ధరించాలి)

‌ఓం పవిత్ర వంతః...... తత్సమాశత | ( మంత్రం వచ్చిన వారు చదువుకోండి )

‌పునరాచమ్య || ( మరల ఆచమనము చేయాలి )

‌భూతోచ్చాటన :- ఉత్తిష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భారకాః | యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే | | | అని చెప్పి నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి , ‌(సాధారణ తర్పణాలకు నీరు,ప్రత్యేక తర్పణాలకు తిలలు వాసన చూడాలి)

‌ప్రాణాయామము :- (ముక్కు. బొటనవేలు,చిటికెన వేలుతొ పట్టుకొని) ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః ఓం మహః ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్పు వస్సు
‌వరోమ్ || ( అని మనసులో జపిస్తూ ప్రాణా యామము చేయాలి )

‌సంకల్పం :- ‌క్రింద ఉన్నవి మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారతాయి. ‌కనుక సంకల్పాన్ని మిగతా ప్రదేశాల వారు మీ ప్రాంత పురోహితులని సంప్రదించగలరు)

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య - శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , శ్రీ గోవింద గోవింద గోవింద |

‌శ్రీ మహా విష్ణొరాజయా ! ప్రవర్తమానస్య | అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే! స్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే | కలియుగే| ‌ప్రధమ పాదే! జంబూ ద్వీపే, భరత వర్షే | భరత ఖండే! మేరోదక్షిణ దిగ్బాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే ,కృష్ణా కావేర్యోర్మద్యదేశే| సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన - వ్యావహారిక చాంద్రమానేన శ్రీప్లవ నామ సంవత్సరే, దక్షిణాయనే.... వర్షఋతౌ.... భాద్రపద మాసే కృష్ణపక్షే
అమావాస్య తిదౌ....సౌమ్యవాసరే.| శ్రీవిష్ణు నక్షత్రే.! శ్రీవిష్ణు యోగే | శ్రీవిష్ణు కరణ | ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిధౌ|

‌ప్రాచీనావీతి:- ( యజ్ఞోపవీతమును ఎడమ నుండి కుడి భుజము పైకి మార్చుకొనవలెను)

‌మహాలయము :- పితృణాం మాతామహాదీనాం సర్వీకారుణ్యానాంచ అక్షయ్య పుణ్యలోకా వాప్త్యర్దం కన్యాగతే సవితరి ఆషాడ్యాది పంచమాపరపక్షొ కర్తవ్య సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ద ప్రతినిధి సద్య, తిల తర్పణం కరిష్యే ||

‌సవ్యం:- సవ్యమనగా ఎడమబుజము పైకి యజ్ఞోపవీతమును మార్చవలెను. సవ్యం చేసుకుని నీరు వదలాలి.

‌ప్రాచీనావీతి:- || మరల ప్రాచీనావీతి చేసుకొనవలెను. ముందుగా తూర్పు కొసలుగా మూడు ధర్బలు, వాటిపై దక్షిణ కొసలుగా రెండు కూర్చలు
‌పరిచి వాటి పై పితృదేవతలను ఓం ఆగచ్చంతు మే పితర ఇమం గృహ్ణాంతు జలాంజలిమ్ || అని చదువుతూ తిలలు వేసి ఆహ్వానించవలెను. దక్షిణముఖముగా తిరిగి, ఎడమ మోకాలు క్రింద ఆన్చి తర్పణ విడువవలెను.

‌"స్వధానమిస్తర్పయామి' అన్నప్పుడల్లా మూడుసార్లు తిలోదకము పితృతీర్ధముగా ఇవ్వవలెను. వారి భార్య కూడా లేనిట్లైతే సవిత్నీకం అని, స్త్రీల విషయమున భర్త కూడా లేనట్లైతే సభర్తకం అని చేర్చుకొనవచ్చును.

‌క్రింద మొదటి ఖాళీలో గోత్రమును, రెండవ చోట వారి పేరును చెప్పి తర్పణ చేయాలి. ప్రతి దానికి ముందు "అస్మత్" అను శబ్దాన్ని చేర్చ వలెను.
‌బ్రాహ్మణులైతే శర్మాణం అన్నది పనికొస్తుంది. కానీ రాజులైతే వర్మాణాం. వైశ్యులైతే గుప్తం, ఇతరులు దాసం అని మార్చి పలకాలి.

‌(ప్రాచీనావీతి) అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం)కరిష్యే.....(ప్రాచీనావీతి) దక్షిణాభిముఖో భూత్వా

‌1) పితరం.. (తండ్రి పేరు చెప్పి) అస్మత్ .....గోత్రం, ..........శర్మాణం..వసురూపం..స్వధానమస్తర్పయామి.. మూడు మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌2) పితామహం..(తాత)
‌అస్మత్ ...... గోత్రం, ....... శర్మాణం.. రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి
‌3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..

‌3)ప్రపితామహం.(ముత్తాత)
‌అస్మత్ ......గోత్రం, .........శర్మాణం... ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి 3మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌4) మాతరం (తల్లి) గోత్రాం...దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి
‌3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌5) పితామహీం (నానమ్మ) గోత్రాం..దాయీం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి
‌3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) గోత్రాం.. దాయీం..ఆదిత్యరూపాం
‌స్వధానమస్తర్పయామి
‌3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌7) సాపత్నిమాతరం ( సవితి తల్లి) గోత్రాం....దాయీం...వసురూపాం స్వధానమస్తర్పయామి
‌3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌8)మాతామహం (తాత . అనగా తల్లి గారి తండ్రి)
‌గోత్రం..శర్మాణం..
‌వసురూపం.. స్వధానమస్తర్పయామి
‌3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌9) మాతుః పితామహం (తల్లి గారి తాత)
‌గోత్రం..శర్మాణం... రుద్రరూపంవసురూపం.. స్వధానమస్తర్పయామి
‌3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌10)మాతుఃప్రపితామహం
‌(తల్లి యొక్క తాతగారి తండ్రి) గోత్రం...శర్మాణం.. ఆదిత్య రూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌11) మాతామహీం.(అమ్మ మ్మ) గోత్రాం..దాయీం. వసురూపాం స్వధానమస్తర్పయామి...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌12) మాతుః పితామహీం.(తల్లి యొక్క నానమ్మ)
‌గోత్రాం.. దాయీం.. రుద్రరూపాం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..

‌13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) గోత్రాం... దాయీం.. ఆదిత్య రూపాం..వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..

‌14) ఆత్మ పత్నీం ( భార్య) గోత్రాం.. దాయీం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...

‌15) సుతం (కుమారుడు)
‌గోత్రం..శర్మాణం.. వసురూపం
‌వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) గోత్రం..శర్మాణం.. వసురూపం
‌వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌17) కనిష్ఠ భ్రాతరం ( స్వంత చిన్నసోదరుడు)
‌గోత్రం..శర్మాణం.. వసురూపం
‌వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌18)తత్పత్నీం (సోదరుని భార్య.. వదిన)గోత్రాం..దాయీం వసురూపాం . స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) గోత్రం..శర్మాణం..
‌వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌20)తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) గోత్రాం..దాయీం
‌వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌21)తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. గోత్రం... శర్మాణం..
‌వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) గోత్రాం..దాయీం..
‌వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌23)మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) గోత్రం..శర్మాణం..
‌వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌24) తత్పత్నీం (మేనమామ భార్య) గోత్రాం..దాయీం..
‌వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

‌25) దుహితరం (కూతురు) గోత్రాం..దాయీం.
‌వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి

English summary
Tarpana should be performed on the day of the Mahalaya New Moon for the ancestral deities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X