• search

అబ్బాయిల వివాహాల్లో తల్లిదండ్రుల పాత్ర: ఎలా వ్యవహరిస్తే మంచిది?

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అబ్బాయిల వివాహాలు అనుకోగానే మరి అబ్బాయి తల్లిదండ్రులకి కూడా అనేక కోర్కెలు ఉంటాయి. అలా కోర్కెలు ఉండటం తప్పు అని నేను అనను. కాని అవి ఎంతవరకు సబబో మనము ఆలోచించుకోవాలి. మన కోరికలవల్ల పిల్లల వివాహము ఆలస్యము అవ్వకూడదు.

  సాధారణంగా అందరం అనుకునే కోరిక కోడలు మెరుపు తీగలాగా, నాజూకుగా అందంగా ఉండాలి అని. అందానికి అసలు ఎవరమైన నిర్వచనం చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పలేము అనే చెప్పవచ్చు. ఎందుకంటే అందం అనేది చూసే కంటినిబట్టి మారిపోతూఉంటుంది.

  What Role Do Parents Play in Their Child’s Marriage?

  నా కంటికి అందంగా అనిపించింది మీ కంటికి అందంగా కనిపించకపోవచ్చు. మీ కంటికి అందంగా అనిపించింది నా కంటికి అనిపించకపోవచ్చు. కాని అమ్మాయి గుణవంతురాలు అనుకోండి....అమ్మాయి యొక్క అంతః సౌదర్యంవల్ల అమ్మాయి మన ఇద్దరి కండ్లకి అందంగానే కనిపిస్తుంది. కాబట్టి అమ్మాయిని ఎంచుకునేటప్పుడు అందానికి కాక గుణాలకి ప్రాధాన్యత ఇవ్వాలి.

  ఇంకొంతమంది తల్లిదండ్రుల ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే నేను ఒక స్థాయిలో ఉన్నాను. మా పెద్దబ్బాయి వాళ్ళ మామగారు మంచి స్థితిపరుడు. ఒక స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక మా అమ్మాయి మామగారో....చెప్పనే అక్కర్లేదు. నా బంగారుతల్లి అదృష్టం కొద్దీ అలాంటి సంబంధం దొరికింది.

  మరి వీడికి కూడా అదే స్థాయిలో ఉండకపోతే ఎలా? అని ఎంత మంచి సంబంధం అయినా అమ్మాయి గుణగణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెద్దల స్థాయిని బట్టి కాదు కదా! మన ఇంటికి వచ్చిన అమ్మాయి మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టేటటువంటిదై ఉండాలి.

  ఎందుకంటే పురుషుడివల్ల అతను ఏ వంశంలో అయితే పుట్టాడో ఆ వంశము ఉద్ధరింపబడుతుంది. మరి ఆడపిల్లవల్లో తన సక్రమమైన ప్రవర్తన వల్ల ఇటు పుట్టినింటివారిని మరియు మెట్టినింటిని కూడా వన్నె తేగగలిగేది ఆడపిల్ల మాత్రమే.
  అలాగే కట్నకానుకలు కూడా మనం ఒక ఆడపిల్లకి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలము.

  మీరే చెప్పండి. ఆడపిల్ల తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, తాను పుట్టి పెరిగిన ఊరును, స్నేహితులను, తన ఇంటి పేరును, తన గోత్రాన్ని వదిలేస్తుంది. తనకి మరణ సదృశం అని తెలిసినప్పటికీ ఈ ఇంటి వంశాభివృద్ధికోసం తన ప్రాణాన్నే పణంగా పెడుతుంది. ఇన్ని త్యాగాలు చేసే అమ్మాయి దగ్గరనుండి కట్నకానుకలు ఆశించడం సమంజసమేనా.

  ఈ కోణంలో అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించి మన ఇంటికి తెచ్చుకునే అమ్మాయి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా అబ్బాయికి 24 నుంచి 27 వసంతాలకు వివాహం చేయవచ్చు.

  English summary
  In almost all communities, particularly faith-based, children are seen as an invaluable gift and trust; parental love for them knows no bound. In light of the decline in marriage and an increasing number of divorces, parents rightly see it their responsibility (familial, not coercive) to help in their loved one’s successful marriage.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more