వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో చీపురు ఎక్కడ, ఎలా పెట్టాలి

|
Google Oneindia TeluguNews

మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ,ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని శాస్త్రం సూచిస్తుంది.

*ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ (కుబేర స్థానం) ను చూడటం మంచిది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.

*పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి.

* గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు.

* ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నిల్చుని వంట చేయాలి.

Where to keep broom in house

* ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. ఈశాన్యం దర్వాజా తప్ప ఏ వైపు డోర్ వేనుకవైపు గోడకు ఒక మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉండాలి. రివర్స్ పెడితే ఇంట్లో శని దేవుని నిలుపుకున్నట్లే అవుతుంది.

* చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి, కాబట్టి డోర్ వెనక భాగంలో పెట్టుకొమ్మని సలహా ఇవ్వడం జరుగుతుంది.

* ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించడం చేయకూడదు. దీని వలన ఈశాన్య మూల మూతపడుతుంది. అది శుభదాయకం కాదు. గృహంలో ఈశాన్య మూల మూతపడకుండా చూసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈశాన్య దిక్కు మూతపడ్డట్లైతే అశుభ ఫలితాలు సంభవిస్తాయి.

*వసతిలేక ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకోలేని పక్షంలో తూర్పు , పడమర వైపు గల గోడలోనే పూజ చేసుకునే విధంగా అమర్చుకోవడం శుభప్రదమని వాస్తు చెబుతోంది. ఉత్తర ,దక్షిణ దిశలలో పూజ పనికి రాదు.

* శాస్త్రాన్ని నమ్మి సూచనలు పాటిస్తే శుభాలు కలుగుతాయి.పెద్దల మాట సద్దన్నం ముట అన్నారు.

English summary
Most people do not know where and how we want to house a broom used to make a mistake. According to our science, science suggests that if you follow some suggestions, you will be able to move forward in life paths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X