ఊరంత చెప్పినా ఉత్తరం వైపు నిద్రించరాదా? ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు? ఇది నమ్మశక్యమేనా? అని చాలామందికి అనుమానాలు ఉంటాయి. పడుకుంటే ఏం పర్వాలేదులే అని కొంత మంది నిద్రిస్తుంటారు.మరి కోందరేమో పెద్దలు చెప్పారు కదా! అలా పడుకుంటే మంచిది కాదు అని భావించి ఒక నమ్మకంతో పాటిస్తుంటారు.

అసలు వాస్తవంలోకి తోంగి చూస్తే ఈ ఉత్తర దిశగా తల పెట్టి పడుకోవడం అనేది శాస్త్రమే కాదు సైన్స్ పరంగా కూడా నిజమే అని తెలియ జేయడం జరిగింది. అది ఎలాగంటే

Why head will not be on Nrth side, while sleeping?

మన భూమికి గురుత్వాకర్షణశక్తి ఉంది అని మనం చదువుకున్నాము.భూమికి ఉత్తర దక్షిణాల వైపు నార్త్ పోల్,సౌత్ పోల్ అనే రెండు ధృవాలు అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయని మనకు తెలిసినదే,చదువుకున్నదే కదా!

మన శరీరంలో ఐరన్ ఉంటుంది ఇది తెలిసినదే,ఇవన్ని మనం సైన్స్ ద్వారా తెలుసుకున్నాము.ఇనుము,అయస్కాంత పదార్ధాలు ఒకే దిశలో ఉంటే ఆకర్శించుకుంటాయి.రెండు అయస్కాంతం ముక్కలను గమనిస్తే ఒక వైపు అతుక్కునే ఆకర్షణను కలిగి ఉంటాయి.అదే రెండవ వెనక వైపు పెడిటే వికర్షణను గమనిస్తాం.

వెనకటి కాలం పెద్దలు అంటారు ఉత్తరానికి తలపెట్టి దున్నపోతు కూడా పడుకోదు అని చెబుతారు.ఇదే శాస్త్ర ప్రకారం సామెత రూపంలో చూస్తే దాన ధర్మాలు చేయక పోయినా పర్వాలేదు నాయన కాని దక్షిణం వైపు తలపెట్టి పడుకో,ఉత్తరం నిద్ర వద్దు అని అంటారు.
మనం ఉత్తరం వైపు నిద్రపోయామంటే మన తల ఉత్తర దిశ వైపు ఉంటుంది.

మన శరీరంలో అత్యంత విలువైన శక్తి వంతమైన మెదడు ఆ ఉత్తర దిశలో ఉన్న ఆయస్కాంత శక్తి ప్రభావంతో మెదడులో ఉన్న కోబాల్ట్ నికిల్"ఐరన్" కణాలను ఆకర్షించడం వలన మెదడులో ఉన్న ప్రభావంతమైన శక్తిని కోల్పోవడం జరిగి తరచు పీడకలలు రావడం,అర్ధరాత్రి మేలుకువ రావడం,సరిగ్గా నిద్ర పట్టక పోవడం వలన మానసిక రోగులుగా తయారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కేవలం మన అశ్రద్ధ వలన ఆరోగ్య వంతంగా ఉన్న మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. దానితో పాటు అనేక ఆరోగ్య,మానసిక సమస్యలు వస్తాయి.రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది.ఈ పద్దతిని మనం సైన్స్ ద్వార మొన్న మొన్న తెలుసుకోగలిగాము కాని మన భారతీయ శాస్త్రాలు ఎప్పుడో తెలియ జేసాయి ఇప్పటికైనా ఆలోచించండి శాస్త్రాన్ని ఎంతగా నమ్మి ఆచరించాలో అని తెలుస్తుంది.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Why we will not sleep putting head on north side? Astrologer explains.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి