వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాచీన వ్రతాలు, నోములు: ఏమిటీ వటసావిత్రీ వ్రతం?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ప్రాచీనకాలం నుంచి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. సాక్షాత్తూ దేవుళ్లు కూడా ఇటువంటి ఆచారాలను అవలంభించారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అటువంటి నోములలో 'వట సావిత్రి వ్రతం' కూడా ఒకటి.

స్త్రీలు ఐదవతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి ఇందులో విశేషమైనవి. వీటిలో వట సావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజ చేయడం ద్వారా జరుపుకుంటారు.

Why Nomu and Vrathams are performed?

జీవన విధానంలో సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి కాపాడేవ్రతంగా 'వటసావిత్రీ వ్రతం'ను చెప్పుకొచ్చు. దీనిని జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమ నాడు ఆచరించాలి. ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠబహుళ అమావాస్యనాడు ఆచరించవచ్చు.

పురాణగాథ
ఈ వ్రతం వెనుక ఉన్న సావిత్రి, సత్యవంతుల కథ ఉంది. ఈ వ్రతం ఆచరించే సావిత్రీ తన భర్త సత్యవంతుని మృత్యువు నుంచి కాపాడుకోగలిగింది. అశ్వపతి-మాళవి దంపతుల కూతురు 'సావిత్రి' యుక్తవయసులో ఉండగా.. నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి తనయుడైన సత్యవంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్యవంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్పటికీ, సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశారు. మెట్టినింట చేరి భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది.

సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాలకోసం అడవికి బయలుదేరగా, సావిత్రీ భర్త వెంట వెళ్లింది. సమిధులను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది. కొద్ది సేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడ తన భర్తను అనుసరించి వెళ్ళసాగింది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావిత్రిని వరం కోరుకోమన్నాడు.

'మామగారికి దృష్టి ప్రసాదించండి' అని ఓ వరాన్ని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో, ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా.. 'నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి' అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా, వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథనం. వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తూ చేసి 'వట సావిత్రి వ్రతం' అమల్లోకి వచ్చినట్లు పురాణగాథ.

వ్రత విధానము
ఈ వ్రతాన్ని చేసే వారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేయాలి. అక్కడ సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మనువైధవ్యాధి సకల దోష పరిహారార్ధం.

బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరి ష్యే
..అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ విధంగా మర్రిచెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మర్రిచెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేసి, నైవేద్యం సమర్పించి, బ్రాహ్మణులు, ముత్తైదువలకు దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. ఇలా చేస్తే భర్త దీర్ఘాయుర్దాయం పొందుతాడు. పూజ పూర్తయ్యాక ప్రతి స్త్రీ, ఐదుగురు సుమంగళుల నొసట బొట్టు పెట్టి గౌరవించాలి. ఇలా చేస్తే స్త్రీలకు ఐదవతనంతో పాటు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు లభించడంతోపాటు రకరకాల దోషాలు, పాపాలు, కష్టనష్టాల నుంచి విముక్తిని పొందుతారు.

English summary
Why Nomu and Vrathams are performed? Thadiya Nomu / Gauri Thadiya Puja / Gauri Thadiya Vratham, Kedareswara Nomu, Varalakshmi Vratams can perform for better life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X